గర్ల్‌ఫ్రెండ్‌ ప్రేమ‌గా పెంచుకుంటున్న పిల్లిని వాషింగ్‌మెషిన్ వేసి తిప్పాడు!నిమిషానికి 800 సార్లు

మాస్కో: త‌న గ‌ర్ల్‌ఫ్రెండ్‌పై అక్క‌సును, ఆగ్ర‌హాన్ని ఆమె ప్రేమ‌గా పెంచుకుంటున్న పిల్లిపై చూపాడో ఘ‌నుడు. ఆ పిల్లిని దారుణంగా చంపేశాడు.

పిల్లిని వాషింగ్ మెషిన్‌లో ప‌డేసి స్విచ్ ఆన్ చేశాడు. హైస్పీడ్‌లో పెట్టాడు. నిమిషానికి 800 సార్లు తిరిగిందా వాషింగ్ మెషీన్‌. అర‌గంట‌ పాటు వాషింగ్ మెషీన్‌ను ఆన్‌లోనే ఉంచేశాడు.

ర‌ష్యాలో చోటు చేసుకుంది ఈ ఘ‌ట‌న‌. ఆ కిరాత‌కుడి పేరు ఇవాన్ వాసిలియేవ్‌. న‌గ‌రంలోని ఓ పార్క్‌లో త‌న ప్రియురాలిని క‌లుసుకున్నాడు.

ఆ స‌మయంలో ఇద్ద‌రి మ‌ధ్యా గొడ‌వ చెల‌రేగింది. దీనితో తీవ్ర ఆగ్ర‌హానికి గురైన ఇవాన్‌.. ఆమె త‌న వెంట తెచ్చుకున్న పిల్లిని తీసుకుని ఇంటికెళ్లిపోయాడు.

అనంత‌రం.. ఇంట్లో నాలుగు బాటిళ్ల వోడ్కా లాగించాడు. ఆ మ‌త్తులో పిల్లిని వాషింగ్‌మెషీన్‌లో ప‌డేశాడు. వేడి నీళ్లు వ‌చ్చేలా, నిమిషానికి 800 సార్లు తిరిగేలా సెట్ చేశాడు. స్విచ్ ఆన్ చేశాడంతే.

అర‌గంట పాటు ఏక‌ధాటిగా హైస్పీడ్‌లో తిరిగిందా మెషీన్‌. ఆ త‌రువాత దాన్ని తెరిచి చూడ‌గా.. పిల్లి శ‌రీరం ఛిద్ర‌మై క‌నిపించింది. ట్విస్టేమిటంటే- ఈ త‌తంగం మొత్తాన్నీ సెల్ ద్వారా వీడియో తీసి, ప్రియురాలికి వాట్స‌ప్ చేశాడు.

దాన్ని చూసి నిర్ఘాంత‌పోయిన ఆమె.. పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఈ వీడియో ఆధారంగా పోలీసులు ఇవాన్‌ను అరెస్టు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here