పెయింట్ కాదు..వుడ్‌వ‌ర్క్ అంత‌కంటే కాదు: అది చెట్టే, అందులో ఉన్న‌ది కుక్క మృత‌దేహ‌మే

కాస్త‌ ప‌రాకుగా చూస్తే చేయి తిరిగిన క‌ళాకారుడు గీసిన పెయింట్‌లా అనిపించ‌వ‌చ్చు లేదా.. అదో అద్భుత వుడ్ వ‌ర్క్‌లా క‌నిపించ‌వ‌చ్చు గానీ.. కాదు. అది చెట్టే, అందులో ఉన్న‌ది కుక్క మృతదేహ‌మే. 1960 నాటి ఘ‌ట‌న అది. జార్జియా అడ‌వుల్లో చోటు చేసుకుంది. ఓ ఎస్టేట్ య‌జ‌మాని పెంపుడు శున‌కం అది.

త‌న కంటికి క‌నిపించిన ఉడుత‌ను ప‌ట్టుకోవ‌డానికి, దాని వెంట ప‌డిందా శున‌కం. ఉడుత క‌దా! చెట్టు తొర్ర‌లో దూరింది. దాన్ని అందుకోబోయిన శున‌కం కూడా తొర్ర‌లోకి దూరింది. ఇరుక్కుపోయింది. చెట్టు మొద‌లులో ఉన్న తొర్ర అది. చెట్టు మొద‌లులో ఉన్న తొర్ర‌లో దూరి.. ఇంకో తొర్ర‌లో నుంచి ఉడుత బ‌య‌టికొచ్చేసింది గానీ.. శున‌కం మాత్రం ఆ ప‌ని చేయ‌లేక‌పోయింది.

లోప‌లే ఇరుక్కుపోయింది. మ‌ర‌ణించింది. ఆ ఎస్టేట్ య‌జ‌మాని ఆ శున‌కం కోసం వెదికాడు, క‌నిపించ‌క‌పోవ‌డంతో వ‌దిలేశాడు. 1980వ ద‌శ‌కంలో ఆ చెట్టును న‌రికారు. దీనితో శున‌కం మృత‌దేహం ఇలా బ‌య‌టికి క‌నిపించింది. దీన్ని జార్జియా య‌థాత‌థంగా జార్జియా మ్యూజియానికి త‌ర‌లించారు. జార్జియా రాజ‌ధాని తిబ్లిసీలో ఉన్న మ్యూజియంలో అతిపెద్ద ఆక‌ర్ష‌ణ‌గా నిలిచిందీ శున‌క వృక్షం. మ‌నం ఎవ‌రైనా అటుగా వెళ్తే.. దీన్ని చూడొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here