`చెప్పండి!నా పెళ్లిపై మీ అభిప్రాయ‌మేంటి?:త‌న పెళ్లికి తానే లైవ్ క‌వ‌రేజ్ ఇచ్చుకున్నవిలేక‌రి

త‌న పెళ్లికి తానే లైవ్ క‌వ‌రేజ్ ఇచ్చుకున్న ఓ ఛాన‌ల్ విలేక‌రి ఉదంతం ఇది. ఆ విలేక‌రి పేరు అమ‌ర్‌గురిరో. పాకిస్తాన్‌లోని ఫైస‌లాబాద్‌లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

పాకిస్తాన్‌లో సిటీ 41 ఛాన‌ల్‌లో అమ‌ర్ గురిరో విలేక‌రిగా ప‌నిచేస్తున్నారు. సోమ‌వారం ఉద‌యం ఫైస‌లాబాద్‌లో ఆయ‌న పెళ్లి జ‌ర‌గ‌నుంది.

పెళ్లి డ్రెస్సులో మెరిసిపోతూ క‌నిపించిన అమ‌ర్‌గురిరో మైక్ అందుకున్నాడు. సిటీ 41 కెమెరామెన్‌ను ద‌గ్గ‌ర పెట్టుకుని.. త‌న పెళ్లి లైవ్‌లో క‌వ‌రేజ్ ఇచ్చాడు.

త‌న‌ పెళ్లికి వ‌చ్చిన ప్ర‌ముఖుల‌ను ఇంట‌ర్వ్యూ చేశాడు. ఒక్క ప్ర‌ముఖుల‌నే కాదు.. పెళ్లి కుమార్తెనూ వ‌ద‌ల్లేదు. నాపై మీ అభిప్రాయం ఏమిటి? అంటూ ప్ర‌శ్న‌లు గుప్పించాడు.

త‌న త‌ల్లిదండ్రులు, అత్తామామ‌లు, బంధువులతో ఇంట‌ర్వ్యూ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను అమ‌ర్ గురిరో సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది కాస్తా హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here