త‌న హంత‌కుడి పేరు చెప్పింది..కన్నుమూసింది!

ఓ యువ‌తి చ‌నిపోతూ.. త‌న హంత‌కుడి పేరును వెల్ల‌డించిన ఉదంతం ఇది. అచ్చం సినీ ఫ‌క్కీలో చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌న పాకిస్తాన్‌లోని కోహ‌ట్ గ్రామంలో చోటు చేసుకుంది. హ‌తురాలి పేరు ఆస్మా రాణి.

మెడికల్ విద్యార్థిని. ఇస్లామాబాద్ మెడిక‌ల్ కాలేజీలో ఆమె మూడో సంవ‌త్స‌రం చ‌దువుతుండేది. ముజాహిద్ అఫ్రిది అనే యువ‌కుడు ఆమెను ప్రేమించాడు.

పెళ్లి చేసుకోవాల‌ని కోరాడు. ఆమె నిరాక‌రించ‌డంతో వెంటప‌డ్డాడు. వేధించాడు. ఆమె అత‌నితో పెళ్లికి అంగీక‌రించ‌లేదు. దీనితో ఆగ్ర‌హానికి గురైన అఫ్రిది ఆమెపై దాడి చేశాడు. క‌త్తితో పొడిచి, పారిపోయాడు.

అత‌నితో పాటు మ‌రో ఇద్ద‌రు వ్య‌క్తులు ఈ ఘాతుకంలో పాల్గొన్నారు. ర‌క్త‌పుమ‌డుగులో ఉన్న ఆస్మారాణిని ఇస్లామాబాద్ ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

అక్క‌డ చికిత్స పొందుతూ ఆమె మ‌ర‌ణించింది. చనిపోవ‌డానికి కొన్ని క్ష‌ణాల ముందు ఆమె.. త‌న హంత‌కుల పేర్ల‌ను వెల్ల‌డించింది.

దీన్ని కుటుంబీకులు వీడియో తీశారు. అఫ్రిది త‌న‌ను హ‌త‌మార్చాడ‌ని చెప్పిన ఆ యువ‌తి.. ఆ వెంట‌నే క‌న్నుమూసింది. దీని ఆధారంగా కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు ఆరంభించారు.

హంత‌కుడు అఫ్రిది సోద‌రుడు మొహ‌మ్మ‌ద్ ఇర్ఫాన్‌ను అరెస్టు చేశారు. అఫ్రిది కోసం గాలిస్తున్నారు. ఇస్లామాబాద్‌లోని బెన‌జిర్ భుట్టో అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలో అత‌ను వెళ్లిన‌ట్టు సీసీ టీవీ ఫుటేజిల్లో రికార్డ‌య్యింది.

అక్క‌డి నుంచి అత‌ను సౌదీ అరేబియాకు పారిపోయి ఉంటార‌ని అనుమానిస్తున్నారు. అత‌ని కోసం ఇంట‌ర్‌పోల్ స‌హకారం తీసుకుంటామ‌ని పోలీసులు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here