రోడ్డు మీద గుంత‌ల్లో నిలిచి ఉండే నీటితో ప్లేట్ల‌ను క‌డిగిన హోట‌ల్ సిబ్బంది..!

ఈ ఫొటోలో కొంద‌రు వ్య‌క్తులు రోడ్డు మీద కూర్చుని ప్లేట్ల‌ను క‌డుగుతున్న‌ట్టు క‌నిపిస్తున్నారు క‌దూ! వాళ్లు రోడ్డు మీద కూర్చున్న‌ది నిజ‌మే. వాళ్లు క‌డిగే నీరు రోడ్డు మీద గుంత‌ల్లో నిలిచి ఉండేది. ఇదేమీ కొత్త కాద‌ట ఆ హోట‌ల్ సిబ్బందికి. నీటి ఖ‌ర్చును త‌గ్గించ‌డానికి వారు వారంలో క‌నీసం మూడురోజులు ఇలా రోడ్డు మీద నిల్చున్న నీటితో ప్లేట్ల‌ను క‌డుగుతార‌ట‌.

అవే ప్లేట్ల‌లో భోజ‌నం పెట్టి హోట‌ల్‌కు వ‌చ్చే క‌స్ట‌మ‌ర్ల‌కు అందిస్తారు. ఇదీ అక్క‌డి త‌తంగం. ఈ హోట‌ల్ పేరు రాజ్ బ‌నానా లీఫ్ రెస్టారెంట్ అండ్ హోట‌ల్‌. మ‌లేసియాలో ఉందీ హోట‌ల్‌. రాజ‌ధాని కౌలాలంపూర్ శివార్ల‌లోని బంగ్స‌ర్ అనే ప్రాంతంలో ఉందీ హోట‌ల్‌. రాజ్ బ‌నానా లీఫ్ పేరు చైన్ హోట‌ళ్లు ఉన్నాయి. బంగ్స‌ర్‌లోనూ దానికి ఓ అవుట్‌లెట్ ఉంది.

ఆ అవుట్‌లెట్ వ‌ద్ద ఈ నెల 28వ తేదీన‌ రాత్రి ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో వెలుగులోకి వ‌చ్చిన వెంట‌నే- స్థానిక అధికారులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. హోట‌ల్‌ను సీజ్ చేశారు. హోట‌ల్ యాజ‌మాన్యం కూడా స్పందించింది. ఈ ఘ‌ట‌న త‌మ‌ను బాధించింద‌ని, క్ష‌మించాల‌ని కోరుకుంది.

 

 

Raj's Banana Leaf "Cleaning" the plates

Raj's Banana Leaf "Cleaning" the plates"We are very sorry by the regrettable actions by our new staffs and understand that this is not acceptable. " – Raj's Banana LeafDated: 28 May 2018Location: Raj's Banana Leaf, Bangsar OutletCredit: facebook/louischew

Fabrications About The PAPさんの投稿 2018年5月29日(火)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here