విమానంలో 345 ప్ర‌యాణికులు..6,364 కిలోమీట‌ర్ల ప్ర‌యాణం.. సాంకేతిక లోపం!

న్యూఢిల్లీ: రష్యాకు చెందిన ఓ విమానం న్యూఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎమ‌ర్జెన్సీ ల్యాండ్‌ అయ్యింది. సాంకేతిక లోపం తలెత్తడంతో ఈ విమానాన్ని అత్య‌వ‌స‌రంగా ల్యాండ్ చేయాల్సి వ‌చ్చింది. విమానంలో మొత్తం 345 మంది ప్ర‌యాణికులు, సిబ్బంది ఉన్నారు. ఈ విష‌యాన్ని విమానాశ్రయ అధికారులు ధ్రువీకరించారు.

విమానంలో మొత్తం 345 మంది ప్రయాణికులు ఉన్నారని తెలిపారు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని, వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదని విమానాశ్రయ అధికారులు తెలిపారు. వియత్నాంలోని ఫు క్వోక్‌ నుంచి రష్యాలోని ఎకాటెరింగ్ బ‌ర్గ్‌కు వెళ్తుండ‌గా ఈ ఘ‌ట‌న సంభ‌వించింది. సాంకేతిక లోపం త‌లెత్తిన స‌మ‌యంలో ఆ విమానం మ‌నదేశ గ‌గ‌న‌త‌లం మీదుగా ఎగురుతోంది.

వెంట‌నే పైలెట్ ఇందిరాగాంధీ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం అధికారుల‌కు స‌మాచారం ఇచ్చారు. వెంట‌నే వారు గ్రౌండ్ క్లియ‌రెన్స్ ఇవ్వ‌డంతో విమానం అత్య‌వ‌స‌రంగా ల్యాండ్ అయ్యింది. విమానాశ్ర‌యంలోని 11 నంబ‌ర్ రన్‌వేపై విమానాన్ని దించారు. ముందుజాగ్ర‌త్త చ‌ర్య‌గా ఎనిమిది అగ్నిమాపక యంత్రాలు, అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here