తెలుగు సినిమా పాట‌ల డెస్టినేష‌న్ వెనిస్ సిటీలోని కాలువ‌ల దుస్థితి ఇదీ!

వెనిస్ సిటీ తెలుసుగా! నీటిపై తేలియాడే న‌గ‌రంగా పేరుంది. వెనిస్ సిటీలో రోడ్లు ఉండ‌వు. బైక్‌లు, కార్లు, బ‌స్సులూ అస‌లే ఉండ‌వు.

ఆ న‌గ‌రంలో ఎక్క‌డ చూసిన పిల్ల కాలువ‌లే ఉంటాయి. ఎక్క‌డికి వెళ్లాల‌న్నా ప‌డ‌వ‌ల్లోనే వెళ్లాల్సి ఉంటుంది. మ‌న తెలుగు సినిమాల‌కు అదో పెద్ద డెస్టినేష‌న్ స్టేష‌న్ కూడా.

చాలా సినిమాల్లో డ్యూయెట్ల‌ను చిత్రీక‌రించార‌క్క‌డ‌. ఇప్పుడా సిటీ వార్త‌ల్లోకెక్కింది. ఎందుకంటే- వెనిస్ న‌గ‌రం వ‌ట్టిపోయింది. ఆ న‌గ‌రంలో ఏ పిల్ల కాలువ కూడా నీటితో నిండుగా లేదు.

బుర‌ద‌తో కంపుకొడుతున్నాయి. కాలువ‌ల్లో నీరంతా వెన‌క్కి వెళ్లింది. దీనికి కార‌ణం.. వ‌ర్షాలు లేక‌పోవ‌డం. రెండేళ్లుగా వ‌ర్షాలు లేక‌పోవ‌డం వ‌ల్ల వెనిస్ సిటీ ఇలా వ‌ట్టి పోయి క‌నిపిస్తోంది.

కాలువ‌ల్లో ఎక్క‌డా చుక్క నీరు ఉండ‌ట్లేదు..బుర‌ద త‌ప్ప‌. దీనితో ప‌డ‌వ‌ల‌న్నీ ఒడ్డెక్కాయి. విశ్రాంతి తీసుకుంటున్నాయి. దీని ప్ర‌భావం జ‌న‌జీవ‌నంపై తీవ్రంగానే ప‌డింది.

జ‌నం ఇళ్ల‌ల్లో నుంచి బ‌య‌టికి అడుగు పెట్టాలంటే ప‌డ‌వ‌లు కావాలి. అవి లేక‌పోవ‌డం వ‌ల్ల ఇబ్బందుల‌కు గుర‌వుతున్నారు. పైగా బుర‌ద‌నీరు ఉండ‌టం వ‌ల్ల దుర్వాస‌న వ‌స్తోందంటూ చెబుతున్నారు.

పున్న‌మిరోజుల్లో ఆటుపోట్లు స‌హ‌జం. మొన్న‌టి చంద్ర‌గ్ర‌హ‌ణం నాడు ఆడ్రియాటిక్ స‌ముద్రపు నీరు మొత్తం వెన‌క్కి వెళ్లింది. మ‌ళ్లీ ముందుకు రాక‌పోవ‌డం కూడా కార‌ణ‌మ‌ని చెబుతున్నారు స్థానికులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here