బ్రెస్ట్ స‌ర్జ‌రీ స‌క్సెస్ అయింద‌ని.. రోగితో సెల్ఫీ దిగిన డాక్ట‌ర్‌! అక్క‌డే ట్విస్ట్‌!

వ‌క్ష‌స్థ‌లానికి ప్లాస్టిక్ స‌ర్జ‌రీ చేయించుకున్న‌దో ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లి. ఆ స‌ర్జ‌రీ స‌క్సెస్ అయింద‌ని.. బ్రెస్ట్‌ను చూపిస్తూ ఆమెతో సెల్ఫీ దిగాడు. అలా సెల్ఫీ దిగిన అర‌గంట‌లోనే ఆ మ‌హిళ మ‌ర‌ణించింది. గుండెపోటుతో మ‌ర‌ణించిన‌ట్లు డాక్ట‌ర్లు ధృవీక‌రించం ఇంకో ట్విస్ట్‌. ర‌ష్యా రాజ‌ధాని మాస్కోలో చోటు చేసుకుంది ఈ ఘ‌ట‌న‌.

మృతురాలి పేరు ఎకాటెరినా కిసెలెవా. 32 సంవ‌త్స‌రాల ఎకాటెరినాకు ఇద్ద‌రు పిల్ల‌లు. వ‌క్షోజాలు లూజ్‌గా ఉన్నందుకు ఆమె ప్లాస్టిక్ స‌ర్జ‌రీ చేయించుకున్నారు. మాస్కోలో మంచి పేరున్న ప్లాస్టిక్ స‌ర్జ‌న్ గ్రిగ‌రి పెరెక్రెస్తోవ్ ఆమెకు స‌ర్జ‌రీ చేశారు. అయిదుగంట‌ల పాటు ఈ శ‌స్త్ర చికిత్స కొన‌సాగింది.

స‌ర్జరీ పూర్త‌యిన వెంట‌నే అర్ధ‌న‌గ్నంగా ఉన్న ఎకాటెరినాతో సెల్ఫీ దిగాడు. ఆ త‌రువాత కొద్దిసేప‌టికే ఎకాటెరినా మ‌ర‌ణించారు. డాక్టర్ల నిర్ల‌క్ష్యం వ‌ల్లే త‌న కుమార్తె మ‌ర‌ణించింద‌ని ఎకాటెరినా త‌ల్లి ఆరోపించారు. క్లినిక్‌పై కేసు వేశారు. త‌న కుమార్తె పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నార‌ని, డాక్ట‌ర్లే ఆమెను పొట్ట‌న‌బెట్టుకున్నాని ఆరోపిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here