యాపిల్ స్టోర్ లోనే పేలిన ఐఫోన్ బ్యాటరీ.. ఒకరికి గాయాలు..!

ఐఫోన్ లో సేఫ్టీ ఫీచర్లు ఎక్కువగా ఉంటాయనే కాస్త డబ్బులు వెచ్చించి అయినా యాపిల్ ఫోన్లను కొంటూ ఉంటారు. అయితే అలాంటి యాపిల్ ఫోన్ బ్యాటరీలు పేలుతున్నాయని తెలిస్తే ఎవరికైనా భయమేయదా చెప్పండి. తాజాగా ఓ ఐఫోన్ బ్యాటరీ పేలింది. స్విట్జర్‌లాండ్‌లోని జ్యూరిచ్‌లోని ఒక ఆపిల్ స్టోర్‌లో ఐఫోన్‌ బ్యాటరీ ఒక్కసారిగా పేలిపోవడంతో స్టోర్ ను ఖాళీ చేయించాల్సి వచ్చింది. ఈ ఘటనలో ఒకరు గాయపడినట్లు తెలుస్తోంది.

www.swissinfo.ch వెబ్ సైట్ కథనం ప్రకారం జూరిచ్ లో ఉన్న యాపిల్ స్టోర్ లో బ్యాటరీని మెకానిక్ బయటకు తీయగానే పేలిపోయింది. అది పేలడానికి గల కారణాలు తెలియలేదు. ఈ ప్రమాదంలో రిపేరీ చేస్తున్న వ్యక్తి చేతికి స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. పక్కనే ఉన్న ఏడుగురికి కూడా తేలికపాటి గాయాలయ్యాయని, అయితే ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితి నెలకొనలేదని పోలీసులు తెలిపారు. బ్యాటరీపై వెంటనే క్వార్జ్ శాండ్ ను వేసినట్లు తెలుస్తోంది.

ఈ సంఘటనపై జ్యూరిచ్ ఫోరెన్సిక్ ఇన్స్టిట్యూట్‌ ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలిస్తున్నారని పోలీసు అధికారులు తెలిపారు. అయితే స్టోర్‌ సిబ్బంది తక్షణమే అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదం తప్పిందని ఒక ప్రకటనలో తెలిపారు. అయితే ఈ ప్రమాదంపై ఆపిల్ సంస్థ ఇంకా స్పందించలేదు. యాపిల్ సిక్స్ ఫోన్ బ్యాటరీ పేలినట్లు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here