జియో వ‌ర్సెస్ ఎయిర్‌టెల్ వ‌ర్సెస్ బీఎస్ఎన్ఎల్‌..!

ముంబై: జియోకు పోటీగా ఎయిర్‌టెల్ కూడా మ‌రో స‌రికొత్త ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించింది. ఎయిర్‌టెల్ తాజాగా 499 రూపాయ‌ల ప్రీ పెయిడ్‌ ప్లాన్‌ను ప్ర‌క‌టించింది. ఐపీఎల్ మ్యాచ్‌ల కోస‌మే ఈ ప్లాన్‌ను తీసుకొచ్చిన‌ట్టు భార‌తి ఎయిర్‌టెల్ సంస్థ యాజ‌మాన్యం వెల్ల‌డించింది.

499 రూపాయ‌ల ప్లాన్‌ను రీఛార్జ్ చేసుకుంటే.. ఎయిర్ టెల్ టీవీ యాప్‌లో ఉచితంగా ఐపీఎల్ మ్యాచ్‌ల‌ను చూసేయ్యొచ్చు. యూజ‌ర్ల‌కు రోజూ 2 జీబీ 4జీ డేటా చొప్పున 82 రోజుల వాలిడిటీతో మొత్తం 164 జీబీల‌ డేటా లభిస్తుంది.

అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌ల ఆఫ‌ర్ ఇందులో ఉంది. ఐపీఎల్ కోసం రిల‌య‌న్స్ జియో ఇప్ప‌టికే 251 రూపాయ‌ల ప్లాన్‌ను ప్ర‌క‌టించింది.

బీఎస్ఎన్ఎల్ కూడా త‌క్కువేమీ తిన‌లేదు. కాస్త ఎక్కువే డేటాను ఇస్తోంది. ఐపీఎల్ మ్యాచ్‌ల‌ను ప్ర‌త్య‌క్ష ప్ర‌సారంగా చూడ‌టానికి 248 రూపాయ‌ల ప్లాన్‌ను ప్ర‌క‌టించింది. 248 రూపాయ‌ల‌ను రీఛార్జ్ చేసుకుంటే ఐపీఎల సీజ‌న్ ముగిసే వ‌ర‌కూ రోజుకు 3 జీబీ చొప్పున 153 జీబీల డేటాను ఆఫ‌ర్ చేసింది బీఎస్ఎన్ఎల్‌. ఈ ప్లాన్ వేలిడిటి 51 రోజులు. ఐపీఎల్ మ్యాచ్‌ల‌ను లైవ్ స్ట్రీమింగ్‌లో చూసుకోవ‌చ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here