సిక్సర్లే.. సిక్సర్లు.. చూసేయండి..!

చెన్నై సూపర్ కింగ్స్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో సిక్సర్ల వర్షం కురిసింది. మ్యాచ్ మొత్తానికి 33 సిక్సర్లు నమోదయ్యాయి. ఇది ఐపీఎల్ చరిత్రలోనే సరికొత్త రికార్డు. ఆర్సీబీ జట్టు 16 సిక్సర్లు కొట్టగా.. చెన్నై జట్టు 17 సిక్సర్లు కొట్టింది. ఆర్‌సీబీ జట్టులో అత్యధికంగా డివిలియర్స్(8సిక్స్‌లు), డికాక్(4), మన్‌దీప్ సింగ్(3), వాషింగ్టన్ సుందర్(1) కలిపి మొత్తం 16 బాదారు. లక్ష్య ఛేదనలో చెన్నై బ్యాట్స్‌మెన్లలో అత్యధికంగా అంబటి రాయుడు(8), మహేంద్రసింగ్ ధోనీ(7), షేన్ వాట్సన్(1), డ్వేన్ బ్రావో(1) కలిపి 17 భారీ సిక్సర్లు కొట్టారు. ఈ ఏడాది ఏప్రిల్ 10న కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో 31 సిక్సర్లు నమోదయ్యాయి. అంతకుముందు ఢిల్లీ డేర్‌డెవిల్స్, గుజరాత్ లయన్స్ మధ్య పోరులో కూడా 31 సిక్సర్లు కొట్టారు. ఈ మ్యాచ్ లో నమోదైన 33 సిక్సర్లకు సంబంధించిన వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. మీరు కూడా చూసేయండి..

https://twitter.com/UthaMan1992/status/989278724418887680

https://twitter.com/ravikumar9s/status/989443892691943424

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here