ఐపీఎల్ జ‌ట్ల పేర్లు, వాటి ట్యాగ్‌లైన్లు.. తెలుగు అర్ధాల‌తో!

ఐపీఎల్ ముగింపుద‌శ‌కు వ‌చ్చేసింది. టైటిల్ కోసం స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్, చెన్నై సూప‌ర్‌కింగ్స్ జ‌ట్లు ముంబై వాంఖ‌డే స్టేడియంలో త‌ల‌ప‌డ‌బోతున్నాయి. బ్యాటింగ్‌లో అత్యంత బ‌ల‌మైన జ‌ట్టుగా ఉంది చెన్నై సూప‌ర్‌కింగ్స్‌. ఓపెన‌ర్ల ద‌గ్గ‌రి నుంచి టెయిలెండ‌ర్ల దాకా ఆల్‌రౌండ‌ర్లు ఉన్న టీమ్ అది. స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ బౌలింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

అతి త‌క్కువ స్కోరును కూడా కాపాడుకున్న జ‌ట్టు అది. స‌న్ రైజ‌ర్స్‌కు బౌల‌ర్లే ప్ర‌ధాన ఆయుధం. క్వాలిఫ‌యింగ్ 2 మ్యాచ్‌లోనూ బౌలింగ్‌తోనే విజ‌యం సాధించింది. బ్యాటింగ్‌లో కూడా తీసిపోదు. ఓపెన‌ర్ శిఖ‌ర్ ధావ‌న్‌, కేప్టెన్ విలియ‌మ్సన్.. ఇప్ప‌టిదాకా బెస్ట్ పార్ట్‌న‌ర్‌షిప్‌ను అందించారు. విలియ‌మ్స‌న్ కేప్టెన్సీ హైలైట్‌. బౌల‌ర్ల‌ను మార్చే విధానం అద్భుతం.

విలియ‌మ్సన్ కేప్టెన్సీ, అత‌ని వ్యూహాలు జ‌ట్టును ఫైనల్‌కు చేర్చాయి. మ‌రి కొన్ని గంట‌ల్లో ఫైన‌ల్ మ్యాచ్ ఆరంభం కాబోతోంది. ఈ త‌రుణంలో సోష‌ల్ మీడియాలో ఓ ఫొటో జ‌నాన్ని ఆక‌ట్టుకుంటోంది. ఐపీఎల్ జ‌ట్ల పేర్లు, వాటి ట్యాగ్‌లైన్‌ను తెలుగులోకి ట్రాన్స్‌లేట్ చేసి రాసిన ఫొటో అది. దాని మీద తెగ కామెంట్స్ వ‌స్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here