బంపర్ ఆఫర్ కొట్టేసిన ఐపీఎల్ ఫ్రాంచైజీలు..!

అంతర్జాతీయ క్రికెట్లో ధనిక దేశం ఏదంటే ఠక్కున గుర్తుకు వచ్చే దేశం భారత్. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచ క్రికెట్ ను శాసించే స్థాయిలో మన క్రికెట్ బోర్డు ఉంది. ఇపుడు మనం ఎందుకు ఈ విషయం గురించి మాట్లాడుకుంటున్నాం అంటే బీసీసీఐ తమ ఐపీఎల్ ఫ్రాంచైజీలకి కళ్ళు చెదిరే మొత్తాన్ని అందివ్వనుంది. ఒక్కో సీజన్ కి 250 కోట్ల రూపాయలను ప్రతి ఫ్రాంచైజీ పొందనుంది.

గత ఏడాది వరకు ఐపీఎల్ ప్రత్యక్ష ప్రసార హక్కులు సోనీ ఛానల్ దగ్గర ఉండేవి. కానీ ఈ ఏడాది నుంచి ఐపీఎల్ ను మనం స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ లో వీక్షించబోతున్నాం. ఇందుకు గాను స్టార్ స్పోర్ట్స్ 2018 నుంచి 2022 వరకు వరుసగా ఐదు ఏళ్ళు పాటు బీసీసీఐ కి 16,347 కోట్ల రూపాయలు చెల్లించనుంది. అంటే ఒక్కో ఏడాది కి 3,200 కోట్లు చెల్లిస్తుంది అన్న మాట. సోనీ చెల్లించే మొత్తానికి ఇది నాలుగు రెట్లు ఎక్కువ. మునుపు సోనీ ఏడాదికి 800 కోట్లు చెల్లించేది. ఇక టైటిల్ స్పాన్సర్ గా ఉన్న వీవో కూడా ఏకంగా 2000 కోట్ల రూపాయలు చెల్లించడానికి ముందుకు రావడంతో బీసీసీఐకీ, జట్టు యాజమాన్యాలకు భారీ మొత్తంలో డబ్బు అందనుంది. ఈ ప్రకారం బీసీసీఐ మరింత సంపదను ఆర్జిస్తోంది. పట్టిందల్లా బంగారం అంటే ఇదేనేమో అని మన బీసీసీఐ అదృష్టాన్ని గురించి క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.

ఐపీఎల్ 11వ సీజన్ ఏప్రిల్ 7న మొదలవనుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ లో ముంబై వేదికగా తలపడనుంది. ఫైనల్ కూడా మే27న వాంఖడే స్టేడియంలోనే జరగనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here