బిగ్‌బాస్ హౌస్‌లోకి టీవీ9 యాంక‌ర్

తెలుగు వార్త‌లు, టీవీ న్యూస్ ఛాన‌ళ్ల‌ను రెగ్యుల‌ర్‌గా చూసే వారికి కాస్త బాగా ప‌రిచ‌యం ఉన్న దీప్తి. దీప్తి న‌ల్ల‌మోతు. టీవీ 9 న్యూస్ యాంక‌ర్‌. జ‌ర్న‌లిస్ట్‌. కొద్దిరోజులుగా ఆమె పేరు జనం నోళ్ల‌ల్లో బాగా నానుతోంది. కార‌ణం- బిగ్‌బాస్ సీజ‌న్‌-2 హౌస్‌కు ఆమె ఎంపిక కావ‌డ‌మే. దీప్తి న‌ల్ల‌మోతు బిగ్‌బాస్ హౌస్‌కు ఎంపిక కావ‌డంపై ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న ఆమె చేయ‌లేదు గానీ.. దీనికి సంబంధించి ఫేస్‌బుక్‌లో వెల్ల‌డైన ఓ కామెంట్‌కు దీప్తి లైక్ కొట్టారు.

దీనితో ఆమె బిగ్‌బాస్ హౌస్‌కు ఎంపికైంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మౌతోంది. సీజ‌న్‌-2 నుంచి ఎన్టీఆర్ త‌ప్పుకొన్న విష‌యం తెలిసిందే. ఆయ‌న స్థానంలో నాని ఈ రియాలిటీ షోను హోస్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రోమోలు కూడా విడుద‌ల‌య్యాయి. ప్ర‌స్తుతం షూటింగ్‌కు అన్ని ఏర్పాట్లూ పూర్త‌య్యాయి. ఈ నెల 8వ తేదీ నుంచి షూటింగ్ ఆరంభం అవుతుంద‌ని అంటున్నారు. దీనికోసం అన్న‌పూర్ణ ఏడెక‌రాల్లో సెట్ వేశార‌ట‌.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here