గూగుల్ స్ట్రీట్ వ్యూలో క‌నిపించిందేమిట‌ది? ఏలియ‌న్లేనా? అది ఫ్ల‌యింగ్ సాస‌రా?

న్యూయార్క్‌: అమెరికాలోని లేక్ జార్జియా అనే చిన్న విలేజ్‌. ఆ విలేజ్ ప‌క్క‌నే ఓ న‌ది పారుతుంటుంది. అందుకే- దానికి లేక్ జార్జియా అనే పేరొచ్చింది. ఆ న‌దికి ఓ ప‌క్క ఊరు..ఇంకో ప‌క్క‌కు ఆనుకునే ద‌ట్ట‌మైన అడ‌వులు, కొండ‌లు ఉంటాయి.

ఆ కొండ‌ల మీద క‌నిపించిన ఓ వింత వ‌స్తువు స‌రికొత్త అనుమానాల‌కు తెర లేపింది. భారీ ప‌రిమాణంలో, గుండ్రంటి ఆకారంలో ఉన్న ఆ వ‌స్తువు ఏమిట‌నేది? ద‌ట్ట‌మైన అడ‌వులు, ఎత్త‌యిన కొండ‌ల మీదికి ఎలా వ‌చ్చింద‌నేది అర్థం కాని విష‌యంలా మారింది. ఆ వ‌స్తువును ఏలియ‌న్లు వినియోగించే యుఎఫ్ఓగా భావిస్తున్నారు.

గూగుల్ మ్యాప్స్‌, గూగుల్ స్ట్రీట్ వ్యూలో ఈ వ‌స్తువు అత్యంత స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. అదేమిట‌నేది ఇప్ప‌టికీ స్ప‌ష్టంగా తేల్చి చెప్ప‌లేక‌పోతున్నారు జ‌నం. ఆ వ‌స్తువులో అప్పుడప్పుడు తేలిక‌పాటి క‌ద‌లిక‌లు ఉన్నాయ‌ని అనుమానిస్తున్నారు.

గ్ర‌హాంత‌ర వాసులు అందులో ఉన్నార‌నే పుకారు కూడా వినిపిస్తోంది. గ్ర‌హాంత‌ర వాసులు ఈ వాహ‌నం ద్వారానే భూమ్మీదికి దిగార‌ని చెబుతున్నారు. ఇదంతా ఊహాజ‌నిత‌మ‌ని కొంద‌రు కొట్టి పారేస్తున్నారే త‌ప్ప ఆ వ‌స్తువు ఏమై ఉంటుంద‌నే విష‌యాన్ని మాత్రం ఇదీ అని స్ప‌ష్టంగా చెప్ప‌లేక‌పోతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here