బిగ్‌బాస్ హోస్ట్‌గా ఎన్టీఆర్ ఔట్‌..కొత్త న‌టుడి కోసం చూస్తోన్న నిర్వాహ‌కులు! ఎందుకు?

మీ ఇంటి పైనే కాదు.. ఈ ఇంటిపైన కూడా ఓ క‌న్నేసి ఉంచండి..అంటూ బిగ్‌బాస్ ద్వారా వీక్ష‌కుల‌ను అల‌రించాడు జూనియ‌ర్ ఎన్టీఆర్‌. త్వ‌ర‌లో రెండో సీజ‌న్ షూటింగ్ ఆరంభం కాబోతోంది.

దీనికి హోస్ట్‌గా ఎన్టీఆర్ ఉండ‌ట్లేద‌నే వార్త ఫిల్మ్‌న‌గ‌ర్‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది. అయిదు నెల‌ల త‌రువాత బిగ్‌బాస్‌-2 ప్ర‌సారం కావాల్సి ఉంది. దీనికోసం ఇప్ప‌టి నుంచే షూటింగ్ స‌న్నాహాలను మొద‌లు పెట్టాల‌ని అనుకుంటోందా ఛాన‌ల్ యాజ‌మాన్యం.

ప్ర‌స్తుతం ఎన్టీఆర్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఇందులో ఒక‌టి త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంతో తెర‌కెక్క‌బోతోంది. ఇంకోటి రాజ‌మౌళితో.

ఈ రెండు సినిమాల కోసం ఎన్టీఆర్ ఫుల్ కాల్షీట్లు ఇచ్చేశాడ‌ని, పైగా త్రివిక్ర‌మ్ మూవీలో కొత్త గెట‌ప్‌లో క‌నిపించ‌బోతున్నందున ఫిట్‌నెస్ అవ‌స‌ర‌మైంద‌నే కార‌ణం చెబుతున్నారు. దీనికోసం బ‌రువు త‌గ్గ‌బోతున్నాడట‌ జూనియ‌ర్‌.

మార్చి 23 నుంచి త్రివిక్రమ్ మూవీ రెగ్యులర్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. జూలై చివరి నాటికి ఆ మూవీ కంప్లీట్ చేసుకుని.. రాజమౌళి ప్రాజెక్ట్ లో జాయిన్ అవుతాడు జూనియర్. దీనితో గ్యాప్ ఉండ‌ట్లేద‌ని, అందుకే బిగ్‌బాస్‌ సీజన్ 2కు హోస్ట్ చెయ్య‌డం క‌ష్ట‌మైంద‌ని చెబుతున్నారు. దీనితో ఆ ఛానల్ కొత్త హోస్ట్ హీరో వెతుకులాటలో పడింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here