`సాహో` క్లైమాక్స్ షూటింగ్‌లో ప్ర‌భాస్ గాయ‌ప‌డ్డాడా? అమెరికాలో చికిత్స తీసుకుంటున్నాడా?

ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియ‌రావ‌ట్లేదు గానీ, ప్ర‌భాస్‌కు సంబంధించిన ఓ న్యూస్ సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ప్ర‌భాస్ గాయ‌ప‌డ్డాడ‌ని, అమెరికాలో చికిత్స తీసుకుంటున్నాడ‌నేది దాని సారాంశం.

 

త‌న తాజా చిత్రం `సాహో` క్లైమాక్స్ షూటింగ్ సంద‌ర్భంగా ఓ రిస్కీ ఫైట్ సీన్‌లో ప్ర‌భాస్ డూప్ లేకుండా యాక్ట్ చేశాడ‌ట‌. ఈ సంద‌ర్భంగా ప‌ట్టుత‌ప్పడంతో.. భుజానికి తీవ్ర గాయ‌మైంద‌నే వార్త అది.

కింద‌ప‌డ‌టంతో భుజం ఎముక ప‌క్క‌కు జారింద‌ని, చికిత్స కోసం అమెరికాకు వెళ్లాడ‌ని అంటున్నారు నెటిజ‌న్లు. ఈ వార్త‌ను ఎవ‌రూ ధృవీక‌రించ‌ట్లేదు.

సాహో చిత్రం యూనిట్ కూడా ఈ విష‌యంపై ఎలాంటి స్పంద‌నా వ్యక్తం చేయ‌ట్లేదు. తాను గాయ‌ప‌డ్డాన‌నే విష‌యంపై అటు ప్ర‌భాస్ గానీ, చిత్రం యూనిట్ గానీ దాన్ని ఖండించ‌క‌పోవ‌డంతో.. ఈ వార్త నిజ‌మే అయి ఉండొచ్చ‌ని చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here