మ‌రో ప్ర‌యోగానికి సిద్ధ‌మ‌వుతున్న స‌మంత?

క్రేజీ హీరోయిన్ సమంత విభిన్న పాత్రలకు కేరాఫ్ అడ్రెస్ గా మారింది. ఇటీవల కాలంలో సమంత నటించిన ప్రతి చిత్రం విజయవంతం అవుతోంది. రంగస్థలం, మహానటి, రాజుగారి గది 2 ఇలా విభిన్నమైన చిత్రాలని ఎంచుకుంటూ తన పాత్రలో అద్భుతంగా నటిస్తోంది. సమంత మరో ప్రయోగాత్మక చిత్రంతో సాహసం చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

70 ఏళ్ల వృద్దురాలిగా సమంత కనిపించబోతోందట. ఈ చిత్రానికి డైరెక్టర్ మరెవరో కాదు నందిని రెడ్డి. మిస్ గ్రాన్ని అనే కొరియన్ చిత్రం ఆధారంగా ఈ చిత్రం రూపొందబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్ర కథ ప్రకారం 70 ఏళ్ల వృద్దురాలిగా ఉన్న మహిళ, అతీతమైన శక్తులు ఉన్న ఫోటో స్టూడియోకు వెళ్ళగానే నవయవ్వన యువతిగా మారిపోతుంది. ఈ పాయింట్ తోనే నందిని రెడ్డి కథ సిద్ధంచేసినట్లు వార్తలు వస్తున్నాయి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here