బిగ్‌బాస్ హౌస్‌లో శ్రీ‌రెడ్డి ఎంట్రీ ఖాయం?

తెలుగులో ఓ ప్రైవేటు ఛాన‌ల్‌లో త్వ‌ర‌లో ప్ర‌సారం కానున్న బిగ్‌బాస్ రెండో సీజ‌న్‌లో శ్రీ‌రెడ్డి ఎంట్రీ ఖాయ‌మైంది. జూన్ చివ‌రివారంలో దీనికి సంబంధించిన చిత్రీక‌ర‌ణ ప్రారంభం కానుంది. శ్రీ‌రెడ్డితో పాటు నటి మాధ‌వీల‌త‌, సోనుల‌కు బిగ్‌బాస్ యాజ‌మాన్యం ఆహ్వానాల‌ను పంపించింది.

దీనికి శ్రీ‌రెడ్డి అంగీక‌రించిన‌ట్లు చెబుతున్నారు. బిగ్‌బాస్ వంటి రియాలిటీ షోలో పాల్గొన‌డం ద్వారా కాస్టింగ్ కౌచ్ పోరాటాన్ని ఇంటింటికీ చేర‌వేసిన‌ట్ట‌వుతుంద‌ని, దీనికి ఇంత‌కంటే మంచి వేదిక దొర‌క‌ద‌ని శ్రీ‌రెడ్డి చెబుతున్నారు. ఇక‌- న‌టి మాధ‌వీల‌త‌, సోను కూడా ఇందులో పోటీ ప‌డే ఛాన్స్ ఉంది.

బిగ్‌బాస్ బిగినింగ్‌కు జూనియ‌ర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించారు. ఆ త‌రువాత ఆయ‌న త‌ప్పుకొన్నారు. రెమ్యున‌రేష‌న్ విష‌యంలో భేదాభిప్రాయాలు రావ‌డం వ‌ల్లే ఎన్టీఆర్ త‌ప్పుకొన్నారని అంటున్నారు. ఎన్టీఆర్ స్థానంలో నేచుర‌ల్ స్టార్ నాని హోస్ట్‌గా ఉంటారు. నానికి ఎంత రెమ్యున‌రేష‌న్ ఇవ్వ‌నున్నార‌నేది ఇంకా తెలియ‌రావాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here