వంద ఉపగ్రహాలను నింగిలోకి పంపిన భారత్.. వణికిపోతున్న పాకిస్థాన్..!

భారత్ 100వ శాటిలైట్ ను కూడా విజయవంతంగా నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రయోగించిన పీఎస్ఎల్వీ-సీ40 విజయవంతమవడం విశేషం. తనతో పాటు తీసుకెళ్లిన 31 శాటిలైట్లను ఈ రాకెట్ నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగంతో ఇస్రో చరిత్ర పుటల్లోకి ఎక్కింది. భారత్ కు చెందిన 100 ఉపగ్రహాలను ఇప్పటి వరకు నింగిలోకి పంపింది. ఈరోజు కక్ష్యలోకి పంపిన ఉపగ్రహాల్లో 28 విదేశీ శాటిలైట్లు ఉన్నాయి. వీటిలో కెనడా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, కొరియా, యూకే, అమెరికాకు చెందిన ఉపగ్రహాలు ఉన్నాయి.

అయితే దీనిపై పాకిస్థాన్ తెగ భయపడిపోతోంది. నిఘా కోసమేనంటూ వణికిపోతోంది. ఇస్రో కార్టోశాట్2ఎస్ విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేసింది. పాక్ అభ్యంతరం చెబుతూ ఈ ప్రయోగం వెనుక రెండు రకాల ఉద్దేశ్యాలు ఉన్నాయని పేర్కొంది. మిలటరీ, పౌర అవసరాల కోసం చేస్తున్న ఈ ప్రయోగం ప్రాంతీయ వ్యూహాత్మక సమతుల్యతను దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here