ఆ ఉప‌గ్ర‌హం అడ్ర‌స్ గ‌ల్లంతు! అంత‌రిక్షంలో అన్వేషిస్తోన్న ఇస్రో!

బెంగ‌ళూరు: వ‌రుస విజ‌యాల‌ను అందుకుంటున్న ఇస్రో తొలిసారి ఓ ప‌రాజ‌యాన్ని చ‌వి చూసింది. రెండు రోజుల కింద‌ట జిల్లాలోని శ్రీ‌హ‌రికోట అంత‌రిక్ష ప్ర‌యోగ కేంద్రం నుంచి నింగిలోకి పంపిన జీశాట్-6ఎ అడ్ర‌స్ గ‌ల్లంతైంది. ఇస్రో-ఉప‌గ్ర‌హం మ‌ధ్య ఉన్న స‌మాచారం సంబంధాలు తెగిపోయాయి.

దీనితో ఈ ఉప‌గ్ర‌హం ఎక్క‌డ ఉందో తెలియ‌ట్లేద‌ని ఇస్రో వెల్ల‌డించింది. జీశాట్‌-6ఎతో సంబంధాలు తెగిపోయిన విష‌యాన్ని ఇస్రో ఛైర్మ‌న్ శివ‌న్ ధృవీక‌రించారు. ఉప‌గ్ర‌హం కోసం అన్వేషిస్తున్నామ‌ని, స‌మాచార సంబంధాలు పున‌రుద్ధ‌రిస్తామ‌ని ఆయ‌న చెబుతున్నారు.

జీశాట్‌-6ఎలో అమ‌ర్చిన విద్యుత్ వ్య‌వ‌స్థ ప‌ని చేయ‌క‌పోవ‌డం వ‌ల్లే ఈ లోపం త‌లెత్తి ఉంటుంద‌ని ఇస్రో శాస్త్ర‌వేత్త‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.  270 కోట్ల రూపాయ‌ల వ్య‌యంతో ఇస్రో.. జీశాట్-6ఎ ఉప‌గ్ర‌హాన్ని రూపొందించింది.

ఎంత లేద‌న్నా, క‌నీసం ప‌దేళ్ల పాటు అంత‌రిక్షంలో ప‌నిచేసేంత‌టి శ‌క్తి సామ‌ర్థ్యాలు ఉన్న విద్యుత్ వ్య‌వ‌స్థ‌ను ఆ ఉప‌గ్ర‌హానికి అమ‌ర్చారు. అయిన‌ప్ప‌టికీ.. అది ప‌ని చేయ‌ట్లేదని, దాని వ‌ల్లే ఉప‌గ్ర‌హంతో ఉన్న సమ‌చార సంబంధాలు తెగిపోయాయ‌ని అంటున్నారు. క‌ర్ణాట‌క‌లోని హ‌స‌న్‌లో ఏర్పాటు చేసిన మాస్ట‌ర్ కంట్రోల్ ఫెసిలిటీ ద్వారా అన్వేష‌ణ చేప‌ట్టామ‌ని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here