ద‌గ్గుబాటి అభిరామ్ ఫొటోలు లీక్ చేయొద్దంటూ శ్రీ‌రెడ్డికి రూ.5 కోట్ల ఆఫ‌ర్ ఇచ్చారా?

హైద‌రాబాద్‌: టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్‌పై గ‌ళ‌మెత్తిన వ‌ర్ధ‌మాన న‌టి శ్రీ‌రెడ్డి వ్య‌వ‌హారం వెనుక త‌న హ‌స్తం ఉంద‌ని ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ వెల్ల‌డించారు. కాస్టింగ్ కౌచ్ ముసుగులో జ‌రిగే దారుణాల‌ను వెలికి తీయ‌డానికి ఇదే స‌రైన స‌మ‌యం అని, అందుకే తాను శ్రీ‌రెడ్డిని ప్రోత్స‌హించాన‌ని అన్నారు.

ఈ మేర‌కు 16 నిమిషాల నిడివి ఉన్న వీడియోను ఆయ‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాస్టింగ్ కౌచ్ ప‌ట్ల శ్రీ‌రెడ్డి తిరుగులేని పోరాటం చేశార‌ని అన్నారు. ఈ వివాదంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ పేరును కూడా ప్ర‌స్తావించాల‌ని తానే శ్రీ‌రెడ్డికి సూచించిన‌ట్లు రామ్‌గోపాల్ వ‌ర్మ వెల్ల‌డించారు.

ప‌వ‌న్ క‌ల్యాణ్ పేరును ప్ర‌స్తావిస్తే.. ఈ వ్య‌వ‌హారం జ‌నాన్ని విప‌రీతంగా ఆక‌ర్షిస్తుంద‌ని, టీవీ ఛాన‌ళ్లు ఎగ‌బ‌డి ప్ర‌చారం చేస్తాయ‌ని అన్నారు. అందుకే ప‌వ‌న్ పేరును ప్ర‌స్తావించాల‌ని తాను సూచించాన‌ని, ఈ విష‌యంలో శ్రీ‌రెడ్డి చేసిన ప్ర‌య‌త్నం ఫ‌లించింద‌ని అన్నారు. ఇలా చేసినందుకు ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు క్ష‌మాప‌ణ చెబుతున్నాన‌ని అన్నారు.

ద‌గ్గుబాటి సురేష్ త‌న‌యుడు అభిరామ్ ఫొటోలను లీక్ చేయ‌డం వెనుక కూడా ఉద్దేశం ఇదేన‌ని అన్నారు. అభిరామ్ ఫొటోల‌ను లీక్ చేయ‌కుండా ఉండ‌టానికి సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ అయిదు కోట్ల రూపాయ‌ల‌ను శ్రీ‌రెడ్డికి ఆఫ‌ర్ చేసింద‌ని, దీన్ని ఆమె తిర‌స్క‌రించార‌ని అన్నారు.

దీన్ని తానే డీల్ చేసిన‌ట్లు చెప్పారు. తాను చెప్పిన‌ప్ప‌టికి కూడా శ్రీ‌రెడ్డి అయిదు కోట్ల రూపాయ‌ల‌ను తీసుకోవ‌డానికి అంగీక‌రించ‌లేద‌ని, దీన్ని బ‌ట్టి చూస్తే.. కాస్టింగ్ కౌచ్‌పై ఆమె ఎంత చిత్త‌శుద్ధితో పోరాడుతున్నార‌నేది అర్థం చేసుకోవ‌చ్చ‌ని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here