మీకు ఎంతటి బాధను కలిగిస్తోందో నాకు తెలుసు.. క్షమించండి అన్న వార్నర్..!

బాల్ ట్యాంపరింగ్ వివాదం క్రికెట్ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టించింది. స్మిత్, వార్నర్ లకు ఏడాది పాటూ బ్యాన్ విధించిన క్రికెట్ ఆస్ట్రేలియా బాన్‌క్రాఫ్ట్‌ కు తొమ్మిది నెలల నిషేధం విధించారు. దీనిపై తొలిసారి డేవిడ్ వార్నర్ స్పందించాడు. అభిమానులకు క్షమాపణలు చెబుతూ ట్వీట్ చేశాడు.

‘మేం చేసిన పని ఆటకు, క్రికెట్ అభిమానులకు ఎంతటి బాధను కలిగిస్తుందో తెలుసు. మనం ఎంతో ప్రేమించే ఆటకు ఇదో మచ్చ. చిన్నతనం నుంచే ఈ ఆటను నేనంతగానో ప్రేమించాను. ఇప్పుడు నేను దీర్ఘంగా శ్వాస పీల్చుకోవాల్సిన అవసరం ఉంది. కుటుంబంతో, స్నేహితులు, నమ్మకస్తులైన సలహాదారులతో సమయం గడపుతాను. మరి కొద్ది రోజుల్లో మీ ముందుకొస్తాను.’ అంటూ వార్నర్ ట్వీట్ చేశాడు. వార్నర్ ట్వీట్ పట్ల క్రికెట్ అభిమానులు సానుకూలంగా స్పందిస్తున్నారు. ప్రస్తుతం సిడ్నీ వెళ్తున్నానని.. క్రికెట్‌కు నష్టం వాటిల్లేలా పొరబాటు చేశామని మన్నించమని కోరాడు.

ఇక ఐపీఎల్ సన్ రైజర్స్ హైదరాబాద్ కు కెప్టెన్ గా ధావన్ ను నియమిస్తే బాగుంటుంది అని అభిమానులు ఆశపడుతున్నారు. పదేళ్ల ఐపీఎల్‌ చరిత్రలో తొలిసారి.. అన్ని జట్లకీ భారత క్రికెటర్లు కెప్టెన్లుగా ఉంటారట. బాల్ టాంపరింగ్ వివాదంతో సన్‌రైజర్స్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి డేవిడ్ వార్నర్ బుధవారం తప్పుకోగా.. అతని స్థానంలో కెప్టెన్సీ కోసం రేసులో శిఖర్ ధావన్, కేన్‌ విలియన్స్, షకిబ్ అల్ హసన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ స్టీవ్‌స్మిత్‌ని తప్పించి అజింక్య రహానెకు జట్టు పగ్గాలు అప్పగించిన నేపథ్యంలో.. ధావన్‌కే సన్‌రైజర్స్ కెప్టెన్సీ దక్కనుందని వార్తలు వస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here