బాల్ ట్యాంప‌రింగ్ కేసులో కొత్త కోణం: వార్న‌ర్ భార్య షాకింగ్ స్టేట్‌మెంట్‌!

సిడ్నీ: ఆస్ట్రేలియా క్రికెట్‌ను సంక్షోభాల‌నికి గురి చేసిన బాల్ ట్యాంప‌రింగ్ కేసులో కొత్త కోణం వెలుగులోకి వ‌చ్చింది. బాల్ ట్యాంపరింగ్ ఉదంతం మొత్తానికి క్రికెట‌ర్ డేవిడ్ వార్న‌ర్ భార్యే కార‌ణ‌మ‌ని తేలింది. ఈ విష‌యాన్ని వార్న‌ర్ భార్య క్యాండిస్ స్వ‌యంగా అంగీక‌రించారు.

మొద‌టి టెస్ట్‌మ్యాచ్ సంద‌ర్భంగా ద‌క్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ క్వింట‌న్ డికాక్‌తో డేవిడ్ వార్న‌ర్ ఘ‌ర్ష‌ణ ప‌డ్డాడు. లంచ్‌బ్రేక్ స‌మ‌యంలో రెండు జ‌ట్లూ డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్తున్న స‌మ‌యంలో వార్న‌ర్‌, డికాక్ మ‌ధ్య వాదులాట చోటు చేసుకుంది. ఈ సంద‌ర్భంగా డికాక్‌.. ఆగ్ర‌హంతో వార్న‌ర్ భార్య‌ను తిట్టాడంటూ అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి.

ఈ గొడ‌వ త‌రువాత క్యాండిస్‌ను విమ‌ర్శిస్తూ ప్ల‌కార్డుల‌ను ప్ర‌ద‌ర్శించారు ద‌క్షిణాఫ్రికా అభిమానులు దీనితో తానే బాల్ ట్యాంప‌రింగ్ విష‌యాన్ని ప్ర‌స్తావించాన‌ని క్యాండిస్ చెప్పారు. బాల్ ట్యాంప‌రింగ్ వ్య‌వ‌హారంలో తన తప్పు కూడా ఉందని ఆమె చెప్పారు. దక్షిణాఫ్రికాలో తనపై వచ్చిన విమర్శల కారణంగానే ఇలా జరిగినట్లు వివరించారు.

సోనీ విలియమ్స్ అనే ర‌గ్బీ ఆట‌గాడితో త‌న‌కు అఫైర్ ఉందంటూ ద‌క్షిణాఫ్రికా క్రికెట్ అభిమానులు ఆరోపించార‌ని.. అందుకే తాను బాల్ ట్యాంప‌రింగ్ అంశాన్ని వార్న‌ర్ వ‌ద్ద ప్ర‌స్తావించిన‌ట్లు చెప్పారు. బాల్ ట్యాంప‌రింగ్ ఘ‌ట‌న అనంత‌రం త‌న భ‌ర్త నిరాశ‌లో కూరుకుపోయాడ‌ని, అభిమానులు త‌న భ‌ర్త‌కు అండ‌గా ఉంటార‌ని ఆశిస్తున్న‌ట్టు క్యాండిస్ చెప్పారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here