జబర్దస్త్ దొరబాబుకు పెళ్ళి అయిపోయింది.. ఎవరితో అంటే..!

జబర్దస్త్ టీవీ షోలో హైపర్ ఆది వేసే స్కిట్లకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. చాలా మంది వారి టీమ్ వేసే పంచ్ ల కోసమే టీవీలకు అతుక్కుపోయి ఉంటారు. వారి టీమ్ లో దొరబాబు కూడా ఒకడు. అతడి మీద హైపర్ ఆడి వేసే పంచ్ లు మామూలుగా ఉండవు. అయితే ఇప్పుడు ఆ దొరబాబు ఓ ఇంటివాడయ్యాడు.

తూర్పుగోదావరి జిల్లా తొండంగి‌కి చెందిన దొరబాబు నెల్లూరుకు చెందిన నందిని అనే అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు. నెల్లూరు పట్టణంలోని ఓ లోకల్ ఛానల్‌లో యాంకర్‌గా ఆమె పనిచేస్తోంది. వీరిద్దరూ రెండేళ్ళుగా ప్రేమించుకుంటూ ఉన్నారట. ఇరు కుటుంబాలను ఒప్పించడంతో పెళ్ళి జరిగిపోయింది. ఈ వివాహానికి జబర్దస్త్‌ కళాకారులు హైపర్ ఆది, రైజింగ్ రాజు, గణపతి, అప్పారావు, వినోదిని తదితరులు హాజరయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here