పైన కూర్చోండి బ్రదర్.. కూర్చుంటారా లేదా.. అన్న ఎన్టీఆర్..!

జబర్దస్త్ టీవీ షో ద్వారా ఎంతోమంది టాలీవుడ్ కు పరిచయం అవుతూ ఉన్నారు. కానీ కొందరు మాత్రమే గుర్తింపు తెచ్చుకుంటూ ఉన్నారు. ఇటీవలి కాలంలో జబర్దస్త్ మహేష్ ‘రంగస్థలం’ సినిమా ద్వారా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ సినిమాలో రామ్ చరణ్ ఫ్రెండ్ గా అద్భుతంగా నటించాడు మహేష్. ఇక ‘మహానటి’ సినిమాలో కూడా మంచి రోల్ చేశానని మహేష్ చెప్పుకొచ్చాడు. ఈ ఆడియో ఫంక్షన్ లో ఎన్టీఆర్ తో మాట్లాడిన మహేష్.. వారి మధ్య జరిగిన సంభాషణను బయటపెట్టాడు.

ఎన్టీఆర్ తో మాట్లాడడానికి వెళ్ళిన మహేష్.. మొదట కింద కూర్చొన్నాడు. కానీ ఎన్టీఆర్ బలవంతంగా పైన కూర్చోండి బ్రదర్.. కూర్చొంటారా లేదా అని బలవంతపెట్టి మరీ పైన కూర్చోబెట్టాడు. అంతేకాకుండా రంగస్థలం సినిమాలో తన నటన గురించి కూడా పొగిడాడని మహేష్ చెప్పుకొచ్చాడు. మహేష్ మాటల్లో ఏమన్నాడంటే “బ్రదర్ మీరు రంగస్థలంలో షేక్ చేశారు.. అదిరిపోయింది.. చాలా ఎమోషన్ అయ్యాను మీ సీన్ చూసినప్పుడు.. మనం కలుద్దాం. ఇవి ఎన్టీఆర్ అన్న తనతో మాట్లాడిన గోల్డెన్ వర్డ్స్ అని, కింద కూర్చుని అన్నతో మాట్లాడుతుంటే పైన కూర్చోండి బ్రదర్.. అంటూ పైన కూర్చుంటేనే కానీ ఊర్కోలేదు. ఆయనతో మాట్లాడిన తర్వాత అర్థమైంది ఆయన అంత గొప్పవాడు ఎందుకయ్యారో అని. లవ్ యూ సో మచ్ ఎన్టీఆర్ అన్న” అని మహేష్ చెప్పారు. అలాగే మహానటి సినిమాలో యాక్ట్ చేసినందుకు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నానో, మహానటుడితో మాట్లాడినందుకు కూడా అంతే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థాంక్యూ సో మచ్ నాగ అశ్విన్ సార్ అంటూ చెప్పుకొచ్చాడు మహేష్.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here