చంద్రబాబు సహకరించాలి.. ఆయనకు ఇదొక్కటే సలహా..!

ఎన్డీయేతో భాగస్వామ్యం తెంచుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ సమయంలో ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్ చంద్రబాబు నాయుడుకు ఓ సలహా ఇస్తున్నట్లు తెలిపారు. అదేమిటంటే ఈ నెల 21వ తేదీన అవిశ్వాసం పెట్టడానికి తాము నిర్ణయించామని, అవిశ్వాసానికి చంద్రబాబునాయుడు సహకరించాలని వైఎస్ జగన్ కోరారు. అంతకన్నా ముందైనా అవిశ్వాసం పెట్టడానికి తాము సిద్ధమని స్పష్టం చేశారు.

“నన్ను పెట్టమంటే నే పెడతా. 25కి 25 మంది ఎంపీలూ ఒకతాటిపై నిలబడదాం. అవిశ్వాసం పెడదాం. మేం అవిశ్వాసం పెడతాం మీరు మద్దతు ఇవ్వండి. లేదంటే మీరు పెట్టండి మేము ఇస్తాం అని అన్నారు. దాని తరువాత 25 మంది ఎంపీలతోనూ మూకుమ్మడిగా రాజీనామా చేయిద్దామని.. అప్పుడు దేశమంతా చర్చ జరుగుతుంది అని వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. చంద్రబాబుకు ఆలోచించుకునే సమయం ఇవ్వడానికే 21 వరకూ గడువు ఇస్తున్నామని, రాష్ట్రం మొత్తం ఒకతాటిపై నిలబడి 25 మంది ఎంపీలూ అవిశ్వాసానికి మద్దతుగా నిలిస్తే కేంద్రంపై మరింత ఒత్తిడి పెరుగుతుందని అన్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here