అయిదేళ్ల పాప‌పై సామూహిక అఘాయిత్యం: నిందితుల వ‌య‌స్సెంతంటే?

భువ‌నేశ్వ‌ర్‌: అయిదేళ్ల బాలిక‌పై ఇద్ద‌రు బాలలు సామూహిక అత్యాచారానికి ఒడిగ‌ట్టిన ఘ‌ట‌న ఒడిశాలోని జ‌గ‌త్‌సింగ్‌పూర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఆ పాప పొరుగింట్లో నివ‌సించే బాల‌లు ఈ ఘాతుకానికి పాల్ప‌డ్డారు. వారి వ‌య‌స్సు 11, 13 సంవ‌త్స‌రాలు. ఇద్ద‌రినీ అరెస్టు చేసిన పోలీసులు, రిమాండ్‌కు త‌ర‌లించారు.

జిల్లాలోని కంఠ‌బ‌ల్ల‌భాపూర్ గ్రామంలో బుధ‌వారం సాయంత్రం ఈ దుర్మార్గం చోటు చేసుకుంది. కంఠ‌బ‌ల్ల‌భాపూర్ గ్రామానికి చెందిన అయిదేళ్ల బాలిక ఒక‌టో త‌ర‌గ‌తి చ‌దువుతోంది. ఆ పాప ఇంట్లో ఒంట‌రిగా ఉండ‌టాన్ని చూసిన ఇద్ద‌రు బాలురు ఆమెపై అఘాయిత్యానికి పాల్ప‌డ్డారు. త‌ల్లి ఇంటికి వ‌చ్చేస‌రికి ఆ పాప అప‌స్మార‌క స్థితిలో క‌నిపించింది. వెంట‌నే ఆరా తీయ‌గా.. అస‌లు విష‌యం బ‌ట్ట‌బ‌య‌లైంది.

వెంట‌నే ఆమె స‌ద‌ర్ పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు ఆరంభించారు. ఈ విష‌యం తెలిసిన వెంట‌నే ఆ ఇద్ద‌రూ ప‌రార‌య్యారు. వారిని గాలించి, గురువారం ఉద‌యం అరెస్టు చేశారు పోలీసులు. ఇద్ద‌రు బాలలు త‌మ నేరాన్ని అంగీక‌రించారు. వారికి జ్యువైన‌ల్ హోమ్‌కు త‌రలించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here