ముందేమో విందు భోజనం.. ఆ తర్వాత ఏమి జరిగిందనేదే ఇక్కడ ట్విస్ట్..!

ఈ ఫోటోను గమనించిన ఎవరైనా సరే.. ముందు ఉన్న యాంట్ ఈటర్ పని అయిపోయిందని అనుకుంటారు. కానీ ఆ తర్వాత ఏమి జరిగిందనేదే ఇక్కడ ట్విస్ట్..!

ఓ పెద్ద యాంట్ ఈటర్(చీమలను తింటూ బ్రతికే జీవి) నీళ్ళు తాగడానికి ఓ కొలను వద్దకు వచ్చింది. అయితే దాన్ని గమనించిన ఓ జాగ్వార్ దాని వెనుకనే చడీ చప్పుడు కాకుండా వచ్చి కూర్చొంది. ఎదురుగా దానికి విందు భోజనం ఉన్నట్లే.. అది నీళ్ళు తాగుతూ ఉంటే.. గమనిస్తూ ఉండిపోయింది వెనుక ఉన్న జాగ్వార్. కొద్ది సెకెండ్లలో దాని మీద పడి పీక్కు తింటుందేమోనని మనం అనుకుంటాం. కానీ అలాంటిది జరగలేదు. అది నీళ్ళు తాగుతుంటే వెనుక నుండి నిశితంగా గమనించింది. అది అక్కడి నుండి వెళ్లిపోతుంటే ఏమీ చేయకుండా వదిలిపెట్టేసింది. కనీసం తన వెనుకాల ఆ జాగ్వార్ ఉంది అన్నది కూడా ఆ యాంట్ ఈటర్ గమనించలేదు. బ్రెజిల్ లోని పంటానల్ లో ఈ ఘటన చోటుచేసుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here