ఈ సంక్రాంతి సోగ్గాడు బాలయ్యే.. 10 రోజుల వసూళ్ళు..!

ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన చిత్రాల్లో బాలకృష్ణ – కేఎస్ రవికుమార్ కాంబినేషన్లో రూపొందిన ‘జై సింహా’ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. సంక్రాంతి కానుకగా ఈ నెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలకృష్ణ సరసన నయనతార, నటాషా దోషి, హరిప్రియ కథానాయికలుగా నటించిన ఈ సినిమా, తెలుగు రాష్ట్రాల్లో 10 రోజుల్లో భారీ వసూళ్లను సాధించింది. ఈ సంక్రాంతికి కూడా బాలయ్య బాబు మంచి హిట్ సంపాదించాడు. ఫ్యామిలీ సెంటిమెంట్.. మాస్ ఎలిమెంట్స్ ఉండడంతో బాలయ్య బాబు సినిమా లాభాలు ఆర్జించిపెడుతోంది.

ప్రాంతాలవారీగా చూసుకుంటే, నైజామ్ లో 4.11 కోట్లు .. సీడెడ్ 5.30 కోట్లు .. నెల్లూరులో 1.23 కోట్లు .. గుంటూరులో 2.37 కోట్లు .. కృష్ణా 1.61 కోట్లు .. వెస్ట్ 2.04 కోట్లు .. ఈస్ట్ 2.44 కోట్లు .. వైజాగ్ లో 3.44 కోట్లు .. ఇలా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 22.54 కోట్ల షేర్ ను రాబట్టింది. ఈ వసూళ్లతో డిస్ట్రి బ్యూటర్లు సేఫ్ జోన్ లోకి వెళ్లినట్టు చెబుతున్నారు. ఇటీవలే బాలయ్య బాబు ఈ సినిమా సక్సెస్ మీట్ లో సినిమా అందరికీ లాభాలను తీసుకొని వచ్చిందని.. నిర్మాత సుఖంగా ఉంటే అంతకంటే కావాల్సింది ఇంకేముందని చెప్పాడు.

Disclaimer: Figures mentioned here have been collected from few sources and also include estimates. Authenticity can’t be guaranteed…!

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here