రంజాన్ ఉప‌వాస స‌మ‌యంలో బ‌హిరంగంగా ఏదైనా తిన్నా, తాగినా..మామూలుగా శిక్షించ‌ట్లేదుగా!

ప‌విత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోద‌రులు క‌ఠోరంగా ఉప‌వాసం ఉంటారు. ఉప‌వాస స‌మ‌యంలో వారు క‌నీసం మంచినీరు కూడా తాగరు. గ‌ల్ఫ్ వంటి ముస్లిం దేశాల్లో ఈ ఉప‌వాసం మ‌రింత క‌ఠినంగా ఉంటుంది. అలాంటి దేశాల్లో ముస్లింల ఎదురుగా.. వారిని ఆహారం తినేలా ప్రేరేపించేలా ముస్లిమేత‌రులు ఎలాంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డినా శిక్ష కూడా అంతే క‌ఠినంగా ఉంటుంది.

తాజాగా- యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్ కూడా భారీ శిక్ష‌ను విధిస్తుంది. త‌మ దేశంలో నివ‌సిస్తోన్న ముస్లిమేత‌రులు ఎవ‌రైనా సరే.. రంజాన్ ఉప‌వాస కాలంలో బ‌హిరంగంగా ఏదైనా ఆహారాన్ని తీసుకుంటే, వారికి జైలు శిక్ష విధిస్తామ‌ని ఎమిరేట్స్ ప్ర‌భుత్వం హెచ్చ‌రించింది. జైలు శిక్ష‌తో పాటు 2000 దిర్హాంల జ‌రిమానా కూడా విధిస్తారు.

2000 దిర్హామ్‌లు అంటే మ‌న క‌రెన్సీలో 36,445 రూపాయ‌లు అన్న‌మాట‌. ఈ శిక్ష కేవ‌లం ముస్లిమేత‌రుల‌కే ప‌రిమితం కాలేదు. నాన్ ముస్లింల‌కు కూడా వ‌ర్తించేలా అక్క‌డి ప్ర‌భుత్వం చ‌ట్టంలో స‌వ‌ర‌ణ‌లు తీసుకొచ్చింది. తాము ముస్లింలు కాద‌ని, రంజాన్ ఉప‌వాసంతో త‌మ‌కు సంబంధం లేద‌ని ప‌లువురు చేసిన విజ్ఞ‌ప్తిని అక్క‌డి న్యాయ‌స్థానాలు గానీ, ప్ర‌భుత్వం గానీ అంగీక‌రించ‌ట్లేదు.

నాన్ ముస్లింలు బ‌హిరంగంగా ఆహారాన్ని, ద్ర‌వ ప‌దార్థాల‌ను గానీ స్వీక‌రిస్తే.. అది ముస్లింల‌ను ఆహారం స్వీక‌రించేలా ప్రేరేపించిన‌ట్ట‌వుతుంద‌ని న్యాయ‌స్థానం అభిప్రాయ‌ప‌డుతోంది. అందుకే- నాన్ ముస్లింల‌తో పాటు ముస్లింలకు కూడా ఈ శిక్ష వ‌ర్తించేలా చ‌ర్య‌లు తీసుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here