ప్రియుడిని హ‌త్య‌చేసి, సూట్‌కేసులో కుక్కి

జైపూర్‌: రాజ‌స్థాన్ రాజ‌ధాని జైపూర్ శివార్ల‌లోని అమేర్ ప్రాంతంలో సూట్‌కేస్‌లో ల‌భించిన యువ‌కుడి మృత‌దేహం కేసులో పోలీసులు నిందితుల‌ను అరెస్టు చేశారు. వారిని మీడియా ముందు ప్ర‌వేశ‌పెట్టారు. ఈ ఫొటోలో అమాయ‌కంగా క‌నిపిస్తోన్న యువ‌తే.. ఆ యువ‌కుడి హ‌త్య‌కేసులో ప్ర‌ధాన నిందితురాలు.

ద‌ర్యాప్తులో వెలుగులోకి వ‌చ్చిన ట్విస్టులు పోలీసుల‌ను సైతం ఉలిక్కిప‌డేలా చేశాయి. మంచినీళ్లు తాగినంత సులువుగా కిడ్నాప్‌లు, హ‌త్య‌లు చేసే గ్యాంగ్ అమ్మాయితో ప్రేమ‌లోప‌డిన ఆ యువ‌కుడు.. చివ‌రికి ఆ అమ్మాయి చేతిలోనే దారుణ‌హ‌త్య‌కు గురైన‌ట్లు ద‌ర్యాప్తులో తేలింది.

డ‌బ్బున్న అబ్బాయిల‌ను వ‌ల‌లో వేసుకుని, వారితో శారీర‌క సంబంధాన్ని పెట్టుకోవ‌డానికి కూడా వెనుకాడ‌ని గ్యాంగ్ అది. హ‌తుడి పేరు దుష్యంత్ శ‌ర్మ‌. జోఠ్వాడా గ్రామానికి చెందిన దుష్యంత్ శ‌ర్మ‌కు కొద్దిరోజుల కింద‌ట ఓ అమ్మాయితో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఆమె కిడ్నాప్ గ్యాంగ్ స‌భ్యురాల‌నే విష‌యం అత‌నికి తెలియ‌దు.

ఆదివారం త‌న ప్రియురాలిని క‌లుసుకోవ‌డానికి వెళ్లిన దుష్యంత్ శ‌ర్మ ఇక తిరిగి రాలేదు. అదృశ్యం అయ్యాడు. అదే రోజు సాయంత్రం జోఠ్వాడాలో ఉండే అత‌ని కుటుంబ స‌భ్యుల‌కు ఫోన్ వ‌చ్చింది. దుష్యంత్ శ‌ర్మ‌ను కిడ్నాప్ చేశామ‌ని, తాము అడిగినంత డ‌బ్బులివ్వ‌క‌పోతే.. చంపేస్తామ‌నీ బెదిరించారు.

ఈ విష‌యాన్ని పోలీసుల‌కు తెలియ‌జేశారు కుటుంబ స‌భ్యులు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు మొద‌లు పెట్టిన కొన్ని గంట‌ల్లోనే.. ఓ సూట్‌కేస్ దొరికింది. జైపూర్ శివార్ల‌లోని అమేర్ ప్రాంతంలో నిర్మానుష్య ప్ర‌దేశంలో ల‌భించిన బారీ సూట్‌కేస్‌లో యువ‌కుతి మృత‌దేహం ఉన్న‌ట్టు స‌మాచారం అందింది.

వెళ్లి.. చూడ‌గా అది దుష్యంత్ శ‌ర్మ‌దే కావ‌డం పోలీసులు దిగ్భ్రాంతికి గురి చేసింది. అప్ప‌టికే- ఆ గ్యాంగ్ న‌గ‌రం వ‌దిలి పారిపోయిన‌ట్టు పోలీసులు గుర్తించారు. వారి కోసం గాలించిన పోలీసులు ఎట్ట‌కేల‌కు న‌లుగురిని అరెస్టు చేశారు. వారిని మీడియా ముందుకు ప్ర‌వేశ‌పెట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here