యూనివర్సిటీ వెబ్సైట్ ను హ్యాక్ చేసి ‘హ్యాపీ బర్త్ డే పూజా’ అని వచ్చేలా చేశాడు.. ఆ పూజా ఎవరో..?

ప్రేమ ఎక్కువైందో.. లేక సర్ ప్రైజ్ ఇవ్వాలని అనుకున్నాడో ఏమో కానీ ఓ వ్యక్తి తన గర్ల్ ఫ్రెండ్ పూజాకు హ్యాపీ బర్త్ డే చెప్పడానికి ఏకంగా యూనివర్సిటీ వెబ్సైట్ ను హ్యాక్ చేసేశాడు. వెబ్సైట్ కు సంబంధించిన ఎటువంటి విషయాలు తెలియకపోగా.. ఓపెన్ చేయగానే ‘హ్యాపీ బర్త్ డే పూజా’ అని వచ్చేలా చేశాడు.

ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీ వెబ్‌సైట్‌ హ్యాకింగ్‌కు గురైంది. ఆ వెబ్‌సైట్‌ (http://jmi.ac.in) ను ఓపెన్‌ చేసి చూసిన చాలా మందికి ‘హ్యాపీ బర్త్‌ డే పూజా.. నీ లవ్’ అని కనపడడంతో షాక్ అయ్యారు. ఈ హ్యాకింగ్‌ వ్యవహారంపై సదరు యూనివర్శిటీ ఇంతవరకు స్పందించలేదు. ఈ హ్యాకింగ్‌ చేసింది తామేనని కూడా ఎవరూ ప్రకటన చేయలేదు. అయితే ఆ ‘పూజా’ ఎవరా అని యూనివర్సిటీ మొత్తం వెతుకుతూ ఉన్నారు. ఇక ఆ వ్యక్తి ఎవరో చాలా వెరైటీగా తన ప్రేమను తెలియజేశాడు అని ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటూ ఉన్నారు.

https://twitter.com/AligArkhan/status/998656150496268288

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here