విద్యార్థుల‌తో పాటు నేల మీద కూర్చుని..!

ఉత్త‌రాంధ్ర‌లో ప‌ర్య‌టిస్తోన్న జ‌న‌సేన అధినేత ప‌వన్ క‌ల్యాణ్‌.. విశాఖ‌ప‌ట్నం జిల్లా డుంబ్రిగూడలోని క‌స్తూర్బా పాఠ‌శాల‌ను సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న విద్యార్థుల‌తో మాట్లాడారు. వారికి కొన్ని ప్ర‌శ్న‌లను వేసి, స‌మాధానాల‌ను రాబ్ట‌టారు. నేల మీద కూర్చుని ప‌వ‌న్ క‌ల్యాణ్ విద్యార్థుల‌తో ముచ్చ‌టించారు. జ్ఞాన‌ధార పుస్త‌కాన్ని తీసుకుని, కొద్దిసేపు చ‌దివారు.

అందులోని కొన్ని అర్థాల‌ను వివ‌రించాల్సిందిగా విద్యార్థుల‌ను కోరారు. దీనికి అంగీక‌రించిన వారు వాటిలోని అర్థాల‌ను వివ‌రించారు. ఉపాధ్యాయుల‌తో మాట్లాడారు. అనంత‌రం- విద్యార్థుల త‌ల్లిదండ్రుల‌ను క‌లిశారు. విద్యాబోధ‌న ఎలా సాగుతోంద‌ని ఆరా తీశారు. డుంబ్రిగూడ‌తో పాటు పోతంగి, హౌసింగ్ కాల‌నీ, తోట‌వ‌ల‌స గ్రామాల్లో ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌ర్య‌టించారు. కాలిన‌డ‌క‌న తిరిగారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here