పవన్ అభిమానుల అత్యుత్సాహం.. ఎస్సై చిరంజీవి కాలు విరిగింది..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడు రోజుల తెలంగాణ యాత్ర ముగిసింది. ఈ యాత్రలో ఆయన తన జనసేన సైన్యాన్ని కలిశారు. అలాగే కొందరు అభిమానులను కూడా కలిశారు. జనసేనానిని చూడడానికి అభిమానులు కట్టలు కట్టలుగా వచ్చారు. అయితే కొంతమంది అభిమానుల అత్సుత్సాహం ప్రదర్శిచడంతో ఈ జనయాత్రలో అపశృతులు చోటుచేసుకున్నాయి. పవన్ కళ్యాణ్ అభిమానుల తాకిడికి ఏకంగా ఎస్సై కాలు విరిగింది.


పవన్ యాత్రకు వస్తున్న అభిమానుల్ని కంట్రోల్ చేస్తున్న ఓ పోలీసు అధికారి పవన్ కళ్యాణ్ అభిమానుల అత్యుత్సాహానికి ఆస్పత్రిపాలయ్యాడు. బుధవారం ఖమ్మం జిల్లాలో జనసైనికుల ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా.. పవన్ కళ్యాణ్ స్టేజ్ మీదికి వచ్చే సమయంలో ఆయన కోసం అభిమానులంతా ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో కంట్రోల్ చేయబోయిన ఖమ్మం రూరల్ ఎస్సై చిరంజీవి కాలు విరిగింది. ఆయనతో పాటు అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులకు కూడా చిన్న చిన్న గాయాలయ్యాయి. మంగళవారం నాడు కూడా కారు అద్దాలు పగిలి ఒక అభిమానికి గాయాలయ్యాయి. ఇక పవన్ కళ్యాణ్ మీదకు చెప్పు వేయడం తీవ్ర కలకలం రేపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here