ప‌చ్చ ఛానెళ్లు నా కుటుంబంపై నిర‌వ‌ధికంగా అత్యాచారం చేస్తున్నాయి

*ఛానెళ్ల య‌జ‌మానులు రూ.10 కోట్లు ఇచ్చి మా అమ్మ‌ను తిట్టించాయి
*ఒక‌ప్పుడు దొర‌లు అంటే భూస్వాములు..ఇప్పుడు ఛానెళ్ల య‌జ‌మానులు
*దీనంత‌టికీ సూత్ర‌ధారులు చంద్ర‌బాబు, లోకేష్‌
*క‌న్న‌త‌ల్లిని కాపాడుకోలేన‌ప్పుడు చావే న‌యం
*ప్ర‌త్యేక‌హోదా సాధ‌న కంటే చ‌ట్ట‌బ‌ద్ధ వ్య‌భిచారానికే ప్రాధాన్య‌తా?
*ముఖ్య‌మంత్రిపై జ‌న‌సేనాధీశుడు సంచ‌ల‌నం వ్యాఖ్యాలు
*నిర‌వ‌ధిక ట్వీట్లు
అమ‌రావ‌తి/ హైద‌రాబాద్‌: ప్ర‌ముఖ న‌టుడు, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ మొట్ట‌మొద‌టి సారిగా తాను టీడీపీ మ‌నిషిని కాదు అని అనిపించుకునేలా వ్య‌వ‌హ‌రించారు. ఒక్క‌దెబ్బ‌కు అటు ముఖ్య‌మంత్రి, ఆయ‌న కుమారుడు లోకేష్‌.. ఇటు టీడీపీ అనుకూల మీడియాపై నిప్పులు చెరిగారు. అలాఇలా కాదు.. అదోలా, అసాధార‌ణంగా!

కాస్టింగ్ కౌచ్ ముసుగును అడ్డు పెట్టుకుని శ్రీ‌రెడ్డి ద్వారా చంద్ర‌బాబు, లోకేష్, ఆయ‌న స్నేహితులు, అన్నింటికీ మించి ప‌చ్చ ఛానెళ్ల య‌జ‌మానులు త‌నపై అత్యంత దారుణంగా దాడి చేశార‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నారు. త‌న క‌న్న‌తల్లిని, కుటుంబాన్ని సైతం వ‌ద‌ల‌కుండా విషం క‌క్కార‌ని ఆరోపించారు.

దీనిపై శుక్ర‌వారం ఉద‌యం నుంచి ఆయ‌న వ‌రుస‌గా ట్వీట్ల‌ను సంధిస్తున్నారు. ఏమాత్రం త‌న‌కు సంబంధంలేని వ్యవహారంలోకి లాగ‌డ‌మే కాకుండా తనపై, తన కుటుంబంపై అనుకూల మీడియాతో అత్యాచారం చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ ఘటనలకు సూత్రధారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని ఆరోపించారు.

నారా లోకేశ్‌, టీడీపీ అనుకూల మీడియా దారుణమైన కుట్రలు చేసిందని, 10 కోట్ల రూపాయలు ఇచ్చిమరీ తన త‌ల్లిని తిట్టించారని పవన్‌ ఆరోపించారు. ‘ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడానికి అండగా నిలబడ్డ నాకు చంద్రబాబు నాయుడు గొప్ప ప్రతిఫలం ఇచ్చారు.

సచివాలయం వేదికగా లోకేష్‌, అతని సన్నిహితులు, అనుకూల టీవీ చానెల్స్‌తో కలిసి నా కుటుంబంపై ఆరు నెలలుగా నిరవధిక అత్యాచారం జరిపారు, జరిపిస్తున్నారు. ఈ సందర్భంగా నేను చెప్పదల్చుకున్నది ఒకటే.. కొడుకుగా కన్నతల్లిని కాపాడుకోలేనప్పుడు చావడమే నయం.

ఈ రోజు నుంచి ఏ క్షణమైనా చావడానికి సిద్ధపడి ముందుకు వెళుతున్నాను’’ అని పవన్‌ తెలిపారు. . ప్ర‌త్యేక హోదా సాధ‌న కంటే చంద్ర‌బాబునాయుడుకు చ‌ట్ట‌బ‌ద్ధంగా వ్య‌భిచారం చేయ‌డ‌మే ఇష్టంగా ఉన్న‌ట్టుంద‌ని అన్నారు. దానికే ఆయ‌న ప్రాధాన్య‌త ఇస్తున్నార‌ని చెప్పారు.

ఒక‌ప్పుడు దొర‌లు అంటే భూస్వాముల‌ని, ఇప్పుడు మీడియా ఛాన‌ళ్ల య‌జ‌మానులంటూ ట్వీట్ చేశారు. ఆంధ్ర‌జ్యోతి గ్రూప్ సంస్థల చీఫ్ వేమూరి రాధాకృష్ణ‌, టీవీ 9 అధినేత ర‌విప్ర‌కాశ్‌, ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ ఫొటోలు పెట్టి మ‌రీ ట్వీట్లు చేశారు ప‌వ‌న్ క‌ల్యాణ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here