తెలుగులో జాన్వీ కపూర్?

ఇటీవల అకాల మరణం చెందిన దివంగత హీరోయిన్ శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ బాలీవుడ్ ఎంట్రీ మొన్ననే జరిగింది. ఆమె నటించిన తొలి చిత్రం ధఢక్ మంచి విజయాన్ని అందుకుని అద్భుత కలెక్షలు రాబడుతున్నట్లు సినీ విశ్లేషకులు చెపుతున్నారు. మొదటి చిత్రంతోనే జాన్వీ తల్లిని తలపించిందని, కొందరేమో పదహారేళ్ళ వయసు చిత్రంలో శ్రీదేవి చేసిన నటన మాదిరిగా ఇప్పడు జాన్వీ నటన కూడా నటించిందని కితాబిస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఈ భామ నక్కతోక తొక్కినట్లుగా వార్తలు వస్తున్నాయి. అసలు విషయం ఏమిటంటే, బాహుబలి-2 చిత్రం తరువాత రాజమౌళి ఎన్టీఆర్, రామ్ చరణ్ ల కలయికలో డివివి దానయ్య నిర్మాణంలో త్వరలో తెరకెక్కించబోయే భారీ మల్టి స్టారర్ #RRR చిత్రంలో జాన్విని ఒక హీరోయిన్ గా తీసుకోవాలని ఆ చిత్ర యూనిట్ ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం.

ఈ మేరకు ఇప్పటికే దర్శక ధీరుడు రాజమౌళి, నిర్మాత దానయ్యలు త్వరలో ముంబై వెళ్లి ఆమెకు కథ వినిపించాలని ఆలోచిస్తున్నారట. వారు అనుకుంటున్న పాత్రకు జాన్వీ అయితేనే సరిగ్గా సరిపోతుందని, దఢక్ లో ఆమె నటనకు ముగ్ధులైన వారిద్దరూ ఆమెను ఎలాగైనా ఒప్పించాలని కూడా అనుకుంటున్నారట. ప్రస్తుతం పుకారుగా వైరల్ అవుతున్న ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియదుగాని, ఒకవేళ నిజమే అయితే మాత్రం జాన్వీ రొట్టె విరిగి నేతిలో పడ్డట్లే మరి. అయితే ఈ విషయమై నిజానిజాలు తెలియాలంటే, మరికొద్దిరోజుల్లో ఆగవలసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here