జయా బచ్చన్ ఆస్థులు తెలిసి అంతా అవాక్కయ్యారు..!

బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ భార్య అయిన జయాబచ్చన్ తన ఆస్థుల వివరాలను ప్రకటించారు. రాజ్యసభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ నుంచి సమాజ్ వాది పార్టీ తరఫున ఎంపీగా రాజ్యసభలో అడుగుపెట్టనున్న ఆమె తన నామినేషన్లో తన ఆస్థుల వివరాల్నివెల్లడించింది. ఆమె తన ఆస్తి విలువను రూ.వెయ్యి కోట్లుగా చూపించారు. జయాబచ్చన్ రాజ్యసభలోనే అత్యంత సంపన్నురాలిగా నిలిచినట్లు మీడియా చెబుతోంది.

2012లో రాజ్యసభకు నామినేషన్ వేసిన సందర్భంగా జయాబచ్చన్ తన ఆస్తుల్ని రూ.493 కోట్లుగా చూపించారు. ఐదేళ్ల వ్యవధిలో ఆమె ఆస్థి రెట్టింపు అయినట్లు తెలుస్తోంది. తన భర్త అమితాబ్ తో కలిసి తమ వద్ద రూ.62 కోట్ల విలువైన బంగారం ఉందని ఆమె వెల్లడించారు. అంతేకాదు.. తాను వెల్లడించిన వెయ్యి కోట్ల ఆస్తులకు సంబంధించిన లెక్కల్ని ఆమె చూపించారు. 2014లో బీజేపీ తరపున రాజ్యసభకు ఎన్నికైన రవీంద్ర కిషోర్ సిన్హా అప్పట్లో తన ఆస్థులను 800 కోట్లుగా తెలిపారు. జయ దగ్గర ఉన్న వాహనాల ఖరీదే 15కోట్లకు పైగా ఉందట. రోల్స్ రాయిస్ కారు, మూడు బెంజ్ కార్లు, ఒక పోర్షే, ఒక రేంజ్ రోవర్ ఉన్నాయట. అలాగే ఒక టాటా నానో, ఒక ట్రాక్టర్ కూడా ఉన్నాయి. ఇక అమితాబ్ బచ్చన్ దగ్గర ఉన్న ఓ పెన్ను ఖరీదే రూ.9 లక్షల విలువ ఉందట..!

ఆస్తుల్లో ముఖ్యమైన వివరాలు చూస్తే..

బంగారు రూ.62 కోట్లు

రూ.15 కోట్లు విలువ చేసే 11 కార్లు- రోల్స్ రాయిస్.. మూడు మెర్సిడెస్.. ఒక ఫోర్డ్.. రేంజ్ రోవర్.. టాటా నానోతో పాటు ఒక ట్రాక్టర్

ఫ్రాన్స్ లోని బ్రిగ్నోగాన్ ప్లేగ్ లో 3175 చదరపు గజాల విస్తీర్ణంలో భవనం

నొయిడా.. భోపాల్.. ఫూణే.. అహ్మదాబాద్.. గాంధీనగర్ లో ఆస్తులు

జయాబచ్చన్ కు లక్నోలోని కేరీలో రూ.2.2 కోట్ల విలువైన 1.22 హెక్టార్ల వ్యవసాయ భూమి

అమితాబ్ కు బరాబంకీ జిల్లా దౌల్తాపూర్ లో రూ.5.7 కోట్ల విలువైన మూడు ఎకరాల భూమి

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here