పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసిన జయప్రకాశ్ నారాయణ..!

కొద్ది రోజుల క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రంలోని కొన్ని పార్టీలతో కలిసి సంయుక్త నిజనిర్ధారణ కమిటీ(జేఎఫ్‌సీ)ని ఏర్పాటు చేశారు. ఆ కమిటీలో లోక్ సత్తా పార్టీ కూడా ఉంది. లోక్ సత్తా పార్టీ తరపున ఆ పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ కూడా పాల్గొన్నారు. మొదట్లో కొద్ది రోజులు హడావుడి చేసిన జేఎఫ్‌సీ ఆ తర్వాత ఎందుకో సైలెంట్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ కూడా దీని మీద మాట్లాడలేదు. దీంతో జయప్రకాష్ నారాయణకు కోపం వచ్చింది. పవన్ కళ్యాణ్ మొదట శ్రద్ధ చూపించి తరువాత పట్టించుకోవడం లేదని అన్నారు. కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత దానిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పవన్‌ను ఉద్దేశించి జేపీ అన్నారు. అందుకే తాను స్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేశానని చెప్పారు. జేఎఫ్‌సీ తొలిదశ అయితే స్వతంత్ర నిపుణుల కమిటీ రెండో దశ అన్నారు. జయప్రకాష్ నారాయణ పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయడం ఇదే మొదటిసారి. వచ్చే ఎన్నికల్లో జనసేనతో కలిసి.. లోక్ సత్తా, సీపీఐ, సీపీఎం పార్టీలు కలిసి పోటీ చేస్తాయని అంటున్నారు.


జేఎఫ్‌సీ నివేదిక ఇచ్చిన తరువాత దానిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, అందుకే తాను స్వతంత్ర నిపుణుల కమిటీ ఏర్పాటు చేశానని తెలిపారు. జేఎఫ్‌సీ తొలిదశ అయితే స్వతంత్ర నిపుణుల కమిటీ రెండో దశ అని వ్యాఖ్యానించారు. తాము చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం సమయం ఇస్తే వెళ్లి కలుస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాను తొలుత తెరపైకి తెచ్చింది తానేనని, ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రానికి హోదా వచ్చే అవకాశమే లేదని, ఈ విషయం అన్ని రాజకీయ పార్టీలకు తెలుసని లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ అన్నారు. పేరు ఏదైనా కావచ్చు కానీ, రాష్ట్రానికి రావాల్సిన నిధులన్నీ రావాలని ఆకాంక్షించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here