చంద్రబాబుపై జేసీ దివాకర్ రెడ్డి చేసిన కామెంట్లు విన్నారా..?

మొన్నటి బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు తీవ్ర అన్యాయం జరిగిందని తెలుగు ప్రజలు నేతలు చెబుతూ ఉన్నారు. ఇక తెలుగుదేశం పార్టీ నాయకుడు జేసీ దివాకర్ రెడ్డి బహిరంగంగానే చంద్రబాబుకు చురకలు అంటించారు. తాజాగా మరోసారి చంద్రబాబు మీద తనదైన స్టైల్ లో కౌంటర్లు వేశారు జేసీ దివాకర్ రెడ్డి. ఢిల్లీలో పార్లమెంట్ ప్రాంగణంలో ఆయన మాట్లాడుతూ నాడు ధర్మరాజు అంతటి వాడే యుద్ధానికి ‘సై’ అన్నాడు, మరి, ఈయన (చంద్రబాబు) ఎప్పుడంటారో చూడాలన్నారు.

రాష్ట్ర విభజన చట్టంలో ఉన్నదొకటి, ఈరోజున అమలు పరుస్తామంటున్నది మరోటి అని మండిపడ్డారు. ఏపీకి ఏదో ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని అన్నారని.. ఇప్పుడు, ఆ ప్యాకేజీ లేదూ, పీకేజీ లేదంటూ విమర్శించారు.‘‘మేము మిత్రపక్షంగా ఉండాల్సిన అవసరముందా?’ అని పునరాలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ముఖ్యమంత్రి గారికి సహనం ఎక్కువ. ఇంకా, ఏదో జరుగుతుందనే ఆశలో ఉన్నారని అన్నాడు. ఆ మహానుభావుడు సహనమే కొంపముంచుతోంది. సహనానికి కూడా హద్దుండాలి! అంటూ తన స్టైల్ లో వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో రావాల్సిన నిధులు ఏపీకి వచ్చాయి తప్ప.. బీజేపీకి మిత్రపక్షమని చెప్పి ఒక్క రాగి పైసా కూడా ఇవ్వలేదని మండిపడ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here