రిసార్టులు బుక్ అయ్యాయ్‌!

క‌ర్ణాట‌కలో హంగ్ అసెంబ్లీ ఏర్పాటు కావ‌డం రిసార్టు ఓన‌ర్ల‌కు భ‌లే గిరాకీని తెచ్చిపెట్టింది. ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డానికి బీజేపీకి ఎనిమిది మంది స‌భ్యుల అవ‌స‌రం ఏర్ప‌డిన నేప‌థ్యంలో.. కాంగ్రెస్‌-జేడీఎస్ కూట‌మి స‌భ్యుల‌పై దృష్టి సారించింది. ఒక్కొక్క‌రిని 100 కోట్ల రూపాయ‌ల‌కు బేరం పెట్టార‌ని సాక్షాత్తూ జేడీఎస్ శాస‌న‌స‌భా ప‌క్ష నేత కుమార‌స్వామి ఆరోపించారు.

 

ఇక- త‌మ ఎమ్మెల్యేల‌ను కాపాడుకునే ప‌నిలో ప‌డ్డారు. ఇందులో భాగంగా.. కాంగ్రెస్ పార్టీ త‌మ ఎమ్మెల్యేల‌ను రిసార్టుల‌కు త‌ర‌లించ‌డానికి ఏర్పాట్లు చేసింది. ద‌గ్గ‌రే ఉండ‌టంతో కేర‌ళ‌లోని కోచికి త‌ర‌లించ‌బోతోంది.

దీనికోసం రెండు ప్ర‌త్యేక తేలిక‌పాటి విమానాల‌ను సిద్ధం చేసింది. జేడీఎస్ కూడా అదే బాట‌లో న‌డుస్తోంది. బెంగ‌ళూరు-రామ‌న‌గ‌ర మ‌ధ్య ఉన్న ఈగిల్‌ట‌న్-ది గోల్ఫ్ విలేజ్ రిసార్ట్‌ను బుక్ చేసిన‌ట్లు చెబుతున్నారు. బెంగ‌ళూరులో వ‌రుస స‌మావేశాల త‌రువాత వారిని ఆయా రిసార్టుల‌కు త‌ర‌లిస్తారట‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here