రూ.100 కోట్ల‌కు బేరం పెట్టార‌హో!

ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డానికి అవ‌స‌ర‌మైన ఎనిమిది మంది ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేయ‌డానికి బీజేపీ నాయ‌కులు అనైతిక చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నారని జేడీఎస్ శాస‌న‌స‌భా ప‌క్ష నేత కుమార‌స్వామి ఆరోపించారు. త‌మ పార్టీ ఎమ్మెల్యేల‌ను కొనడానికి డ‌బ్బులు వెద‌జ‌ల్లుతున్నార‌ని విమ‌ర్శించారు.

 

ఒక్కొక్క‌రికి 100 కోట్ల రూపాయ‌ల‌కు బేరం పెట్టార‌ని ధ్వ‌జ‌మెత్తారు. శాస‌న‌స‌భా ప‌క్ష నేతగా ఎన్నికైన వెంట‌నే కుమార‌స్వామి బెంగ‌ళూరులోని పార్టీ కార్యాల‌యంలో విలేక‌రుల‌తో మాట్లాడారు. ఉత్త‌రాది రాష్ట్రాల్లో బీజేపీ మొద‌లు పెట్టిన అశ్వ‌మేధాన్ని తాము క‌ర్ణాట‌క‌లో అడ్డుకోగ‌లిగామ‌ని అన్నారు. బీజేపీని అడ్డుకోవాల‌నే ఏకైక ల‌క్ష్యంతో కాంగ్రెస్‌తో పొత్తుకు సిద్ధ‌ప‌డ్డామ‌ని చెప్పారు.

త‌మ కూట‌మికి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డానికి అవ‌స‌ర‌మైన మెజారిటీ ఉన్న‌ప్ప‌టికీ.. గ‌వ‌ర్న‌ర్ త‌మ‌కు అవ‌కాశం ఇవ్వ‌ట్లేద‌ని అన్నారు. ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డానికి బీజేపీకి ఎనిమిది స‌భ్యుల అవ‌స‌రం ఉంద‌ని, వారిని త‌మ పార్టీ నుంచి కొనుగోలు చేస్తోంద‌ని మండాప‌డ్డారు. ప్ర‌జాస్వామ్యాన్ని బీజేపీ పాతిపెట్టేస్తోంద‌ని విమ‌ర్శించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here