రాంచీలో కలకలం.. పట్టపగలే బీజేపీ నాయకుడి కాల్చివేత..!

రాంచీలో పట్టపగలే దారుణ హత్య చోటుచేసుకుంది. బీజేపీ నేతను ఉదయం 8.30 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఈ ఘటనతో రాంచీలో భీతావాహ వాతావరణం నెలకొంది. భూతగాదాలే ఇందుకు కారణం అయి ఉండచ్చని పోలీసులు భావిస్తున్నారు. మన దేశంలో కూడా గన్ కల్చర్ పెరిగిపోతోందని ఈ ఘటన ఓ ఉదాహరణగా నిలుస్తోంది.

 

ఇంతకూ ఏమి జరిగిందంటే బీజేపీ నేత పంకజ్ గుప్తా రాంచీ లోని పిస్కా రైల్వే స్టేషన్లో రైలు నుంచి కిందికి దిగగానే దుండగులు ఆయన్ను కాల్చి చంపారు. పంకజ్ తలపై కాల్చడంతో ఆయన అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటన పిస్కా రైల్వే స్టేషన్ వద్ద చోటుచేసుకుంది. స్టేషన్‌ వద్ద ఉన్న రామ్‌లాల్ స్వీట్స్‌కి సమీపంలో ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన సంభవించినట్లు తెలిసింది.

నిందితుల కోసం అన్వేషిస్తున్నామని, వారిని పట్టుకుని తీరుతామని పోలీసులు వెల్లడించారు. పిస్కాలో గుప్తా ఓ భూమిని కొన్నట్లు తెలిసింది. అక్కడ నిర్మాణం కోసం తాను తరచూ అక్కడికి వచ్చివెళ్లేవారు. అందువల్ల భూతగాదాలే ఈ దారుణానికి కారణమై ఉండొచ్చనే కోణంలో ఈ కేసును దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. ఈ ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన స్థానికులు స్టేషన్‌కి సమీపంలోని రహదారులను దిగ్బంధించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here