అమ్మోరి గుళ్లో..! ఆయ‌ణ్ని చూడ్డానికి అభిమానులు ఏ రేంజ్‌లో ఎగ‌బడ్డారంటే..!

టీమిండియా మాజీ కేప్టెన్ మ‌హేంద్ర‌సింగ్ ధోనీ.. ఆదివారం అమ్మ‌వారి గుడిని సంద‌ర్శించారు. జార్ఖండ్ రాజ‌ధాని రాంచీ జిల్లా త‌మ‌ర్ బ్లాక్ ప‌రిధిలోని దియోరీలో ఉందీ అమ్మ‌వారి ఆల‌యం. ఆదివారం సాయంత్రం ఒంట‌రిగా గుడికెళ్లిన ధోనీ.. పూజ‌లు చేశారు. కొబ్బ‌రికాయ కొట్టారు. టీమిండియా విదేశీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌డానికి ముందు ధోనీ దియోరి దుర్గ‌మ్మ అమ్మ‌వారి గుడిని సంద‌ర్శించడం ఆన‌వాయితీ.

ఎర్ర‌రంగు టీష‌ర్ట్, జీన్స్ ప్యాంట్‌తో గుడికి వ‌చ్చిన ధోనీని చూడ్డానికి అభిమానులు ఎగ‌బడ్డారు. గుడి పూజారిని ప‌క్క‌కు తోసేంత‌గా ఎగ‌బ‌డ్డారు అభిమానులు. అనుకోకుండా- త‌మ ఆరాధ్య క్రికెట‌ర్ గుడికి వ‌చ్చే స‌రికి అభిమానులు ఉబ్బిత‌బ్బిబ్బ‌య్యారు.

సెల్ఫీలు తీసుకోవ‌డానికి పోటీ ప‌డ్డారు. ఆటోగ్రాఫ్‌ల కోసం త‌న్నుకున్నారు. పూజ పూర్త‌యిన త‌రువాత‌ ధోనీ.. మీడియాతో మాట్లాడ‌లేదు. ఓ ర‌కంగా అభిమానుల తాకిడి, ఆయ‌న‌ను మీడియాతో మాట్లాడ‌నీయ‌కుండా చేసింది. పూజల అనంత‌రం నేరుగా కారు ఎక్కి వెళ్లిపోయారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here