50 పైసలకే అమెరికాకు కాల్.. కువైట్, సౌదీ అరేబియాలకు ఎంతో తెలుసా..?

ఒకప్పుడు ఇతర దేశాలలో ఉన్న మనవాళ్ళకు ఫోన్ చేయాలంటే తడిసి మోపెడు అవుతూ ఉండేది. ముఖ్యంగా అమెరికా, కెనెడాలలో మన వాళ్ళు అధికంగా ఉండేవాళ్ళు. వాళ్ళతో గంటల కొద్దీ మాట్లాడాలని అనుకున్నా కూడా నెట్ కార్క్ ఆపరేటర్ల ఛార్జీల బాదుడు భరించలేక సైలెంట్ అయిపోయేవాళ్లము. అయితే ఇకపై అలాంటి బాదుడు ఏమీ ఉండదు. ఎందుకంటే అమెరికా, కెనెడాలకు ఏకంగా 50 పైసలకే ఫోన్ చేయొచ్చు.

ఈ ఆఫర్ ఏ నెట్ వర్క్ ప్రవేశపట్టిందా అని మీకు డౌట్ కదా.. జియో నుండే..! ఇప్పటికే భారత్ టెలీకాం రంగంలో చవక ధరకే కాల్స్ చేసుకునే వెసులుబాటు అందిస్తున్న ఈ సంస్థ ఇప్పుడు ఇతరదేశాలకు కూడా చాలా తక్కువ ధరకే కాల్ చేసుకునే సదుపాయాన్ని కలిగిస్తోంది. అందుకు మీరు రిలయన్స్ జియో రూ.199కు ఓ పోస్ట్ పెయిడ్ మంత్లీ ప్లాన్ నుయాక్టివేట్ చేసుకోవాలి. ఈ నెల 15 నుంచి ఈ ప్లాన్ అందుబాటులో ఉంటుంది. అపరిమితంగా కాల్స్, అంతర్జాతీయ రోమింగ్ సదుపాయాలను పొందొచ్చు. 25 జీబీ డేటా కూడా ఉచితంగా లభిస్తుంది. అలాగే, అపరిమితంగా ఎస్ఎంఎస్ లు కూడా..! ఎటువంటి డిపాజిట్ అవసరం లేకుండానే ఐఎస్డీ కాలింగ్ ను సైతం యాక్టివేట్ చేసుకోవచ్చు.

అమెరికా, కెనడాలకు నిమిషానికి 50 పైసలకే మాట్లాడుకోవచ్చు. బంగ్లాదేశ్, చైనా, ఫ్రాన్స్, ఇటలీ, న్యూజిలాండ్, సింగపూర్, బ్రిటన్ దేశాలకు చేసే కాల్స్ పై నిమిషానికి రూ.2 చార్జీ, హాంగ్ కాంగ్, ఇండోనేషియా, మలేషియా, టర్కీ దేశాలకు నిమిషానికి రూ.3, ఆస్ట్రేలియా, బహ్రెయిన్, పాకిస్తాన్ థాయిలాండ్ దేశాలకు నిమిషానికి రూ.4, జర్మనీ, ఐర్లాండ్, జపాన్, కువైట్, రష్యా, వియత్నాం దేశాలకు నిమిషానికి రూ.5, ఇజ్రాయెల్, నైజీరియా, సౌదీ అరేబియా, దక్షిణ కొరియా, స్పెయిన్, స్వీడన్, ఈఏయూ, ఉజ్బెకిస్తాన్ దేశాలకు రూ.6కు చెల్లించి మాట్లాడుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here