స్కూటీ మీద బయలుదేరిన ఈ అమ్మాయి ఇంటిని చేరుకోలేదు.. ఏడుస్తూ ఏమి జరిగిందో చెప్పిన చెల్లి..!

కొన్ని కొన్ని సార్లు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ అనుకోని ఘటనలు జరుగుతూ ఉంటాయి. మీరు చూస్తున్న ఈ అమ్మాయి జీవితంలో కూడా అలాగే జరిగింది. స్కూటీ వేసుకొని ఇంటికి బయలుదేరిన ఈ యువతి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైంది. కొద్ది నిమిషాల్లో ఇంటికి చేరుకోనుండగా ఆమె రోడ్డు ప్రమాదంలో మరణించింది.

ఈ ఘటన రాజస్థాన్ లోని జోద్ పూర్ లో చోటుచేసుకుంది. నగరం లోని వీర్ దుర్గాదాస్ మల్టీ లెవల్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కింద ఓ ట్యాంకర్ ఆమెను డీకొట్టింది. దీంతో ఆ యువతి ఘటనా స్థలంలోనే మరణించింది.

బెంగాలీ కాలనీ నివాసి అయిన 20 ఏళ్ల మీనా పూరీ తన చెల్లెలు నికితతో కలసి పుస్తకాలు కొనుక్కొని ఇంటికి బయలుదేరింది. హోటల్ తాజ్ దగ్గర నుండి వాళ్ళు వస్తుండగా ఓ మలుపు వద్ద ట్యాంకర్ ఆమెను గుద్దేసింది. ఈ ఘటనలో ఆమె తలకు బలమైన గాయం తగిలింది. ఘటనా స్థలంలోనే మీనా మరణించిందని చెల్లెలు నికిత ఏడుస్తూ చెప్పుకొచ్చింది. ఆమె శవాన్ని ఎమ్.డి.ఎమ్. ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న బంధువులు ఆమె స్నేహితులు పెద్ద ఎత్తున ఆసుపత్రికి చేరుకున్నారు. నికితకు చిన్న గాయాలు అయింటే వాటికి చికిత్స చేసి ఇంటికి పంపించారు. పోలీసులు ట్యాంకర్ ను సీజ్ చేశారు.. డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.

स्कूटी पर निकली ये लड़की नहीं पहुंच सकी घर, बहन ने रोते हुए बताई पूरी स्टोरी

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here