యువరాజ్ గురించి అడిగితే కోపగించుకున్న అశ్విన్..!

ఈ ఏడాది ఐపీఎల్ ఎంతో రసవత్తరంగా సాగుతోంది.. కొన్ని జట్లు అనూహ్య విజయాలు సాధిస్తూ ఉంటే.. మరి కొన్ని జట్లు అనుకోకుండా చతికిలబడుతూ వస్తున్నాయి. ఇక ఎంతో మంది యంగ్ స్టార్స్ తమ ట్యాలెంట్ ను నిరూపించుకుంటూ ఉంటే.. మరికొంతమంది స్టార్స్ కనీసం న్యాయం చేయడం లేదు.

ఇప్పటికే గంభీర్ తన కెప్టెన్సీ ని వదులుకొని.. యువతకు ఛాన్స్ ఇచ్చాడు. రాణించకుండా ఉన్న మరో స్టార్ ఎవరంటే యువరాజ్ సింగ్ అనే చెప్పాలి. సీనియర్ ప్లేయర్ అయిన యువీ ఈ ఏడాది కింగ్స్ లెవెన్ పంజాబ్ కు ఆడుతూ ఉన్నాడు. పెద్దగా రాణించకపోవడంతో జట్టులో నుండి కూడా తప్పించారు. హైదరాబాద్ లో జరిగిన మ్యాచ్ లో యువీ స్థానంలో మనోజ్ తివారీని ఆడించింది.. కింగ్స్ లెవెన్ జట్టు.

https://www.instagram.com/p/BiELcJMAxLr/?utm_source=ig_embed

ఈ విషయమై యువరాజ్ సింగ్ అభిమానులు ఎంతగానో బాధపడుతూ ఉన్నారు. ఇక యువీ గురించి అశ్విన్ మాట్లాడిన తీరు కూడా యువీ అభిమానుల్లో కోపాన్ని రప్పించింది. ఒక జర్నలిస్ట్ యువరాజ్ సింగ్ ను ఎందుకు తప్పించారు.. ఏమైనా అప్డేట్ ఉందా అని అడిగాడు. దీంతో కోపగించుకున్న అశ్విన్ ‘ఏమి అప్డేట్.. నేను క్లియర్ గా చెప్పాను కదా.. మనోజ్ తివారీని రీప్లేస్ చేశామని’ అని అన్నాడు. దీంతో యువీ అభిమానులకు కోపం వచ్చింది. ఒక లెజెండ్ ను అవమానించడం తప్పు అని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here