ఒకే ఓవర్ లో 37పరుగులు కొట్టిన డుమిని.. అంతకంటే ఎక్కువ కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు..!

యువరాజ్ సింగ్ కొట్టిన ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు క్రికెట్ ప్రేమికుడు ఎవరూ మరచిపోలేరు. ప్రతి బంతికీ ఓ సిక్స్ బాదితే ఓవర్ కి 36పరుగులు వస్తాయి. అంతకంటే ఓ పరుగు ఎక్కువగానే దక్షిణాఫ్రికా క్రికెటర్ జేపీ డుమినీ బాదాడు. ఒకే ఓవర్‌లో ఏకంగా 37 పరుగులు చితక్కొట్టాడు.

మొమెంటమ్ వన్డే కప్‌లో భాగంగా కోబ్రాస్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న డుమినీ నైట్స్ జట్టు లెగ్ స్పిన్నర్ ఎడ్డీ లీ వేసిన ఓవర్‌లో ఏకంగా ఐదు సిక్సర్లు, ఫోర్, రెండు పరుగులు, ఓ నోబాల్‌తో కలిపి 37 పరుగులు రాబట్టాడు. 6-6-6-6-2-5nb-6 ఇది ఆ ఓవర్ చరిత్ర. మొత్తంగా 37 బంతుల్లో 70 పరుగులు చేసిన డుమినీ జట్టును విజయ తీరాలకు చేర్చాడు. 240 పరుగుల విజయ లక్ష్యాన్ని కోబ్రాస్ జట్టు ఈజీగా చేధించిందంటే అందుకు డుమినినే కారణం.

అలాగని డుమినీదే రికార్డు అని మనం అనుకోకూడదు. అంతకు మించి కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. జింబాబ్వే క్రికెటర్ ఎల్టన్ చిగుంబర 2013-14లో జరిగిన ఢాకా ప్రీమియర్‌ లీగ్‌లో బంగ్లాదేశ్‌ బౌలర్ అలావుద్దీన్ బాబు వేసిన ఒకే ఓవర్‌లో ఏకంగా 39 పరుగులు చేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here