మరోసారి తండ్రి కాబోతున్న ఎన్టీఆర్..!

ఎన్టీఆర్ అభిమానులకు మరో గుడ్ న్యూస్.. వారి అభిమాన నటుడు మరోసారి తండ్రి కాబోతున్నాడు. ఆయన భార్య లక్ష్మీ ప్రణతి గర్భవతి అని సమాచారం. ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి దంపతులకు నాలుగేళ్ల కుమారుడు అభయ్ రామ్ ఉన్నాడు. ఈ విషయాన్ని ఎన్టీఆర్ స్వయంగా అధికారిక ప్రకటన చేయనున్నాడని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ సంవత్సరం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పాటు రాజమౌళి చిత్రంలోనూ ఎన్టీఆర్ నటించనున్నాడు.

ఇక త్వరలో ప్రారంభమయ్యే బిగ్‌బాస్‌- సీజన్‌ 2కి హోస్ట్‌గా ఆయన చేయడం లేదని వార్తలు వస్తున్నాయి. ఆ విషయాన్ని షో నిర్వాహకులకు ఆయన స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తారక్‌ నటిస్తున్న సినిమా షూటింగ్‌ మార్పిలో మొదలుకానుంది. ఆ సినిమాలో ఫిట్‌గా కనిపించడానికి బరువు తగ్గే ప్రయత్నాలు ఇప్పటికే జూనియర్‌ ఎన్టీఆర్‌ ప్రారంభించారు. ఆ చిత్రం తరువాత రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్‌తో మల్టీస్టారర్‌ సినిమా ప్రారంభం అవుతుంది. దీనికోసం కనీసం నెల రోజులు హోంవర్క్‌ చెయ్యాలని రాజమౌళి అడుగుతున్నారట. వరుసగా రెండు సినిమాలతో పాటు కుటుంబపరమైన కొన్ని కమిట్‌మెంట్స్‌ కూడా ఉండడంతో హోస్ట్ గా చేయడానికి దూరమైనట్లు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here