జై ల‌వ‌కుశ ద‌ర్శ‌కుడిపై కేసు న‌మోదు! ఆయ‌న కారు ఢీ కొట్టిన దెబ్బ‌కు..!

స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్‌, జై ల‌వ‌కుశ చిత్రాల ద‌ర్శ‌కుడు కేఎస్ ర‌వీంద్ర ఆలియాస్ బాబీపై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది. ర్యాష్ డ్రైవింగ్‌, ప్ర‌మాదం కేసుల కింద ఆయ‌నపై పోలీసులు కేసు న‌మోదు చేశారు. మితిమీరిన వేగంతో కారు నడుపుతూ ఎదురుగా వెళ్తున్న మరో కారును ఢీకొట్టారు. ఒకరికి బలమైన గాయాలయ్యాయి.

బాధితుడి ఫిర్యాదు మేర‌కు బాబీపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. అమీర్‌పేటకు చెందిన హర్మీందర్‌సింగ్ రాత్రి కుటుంబసభ్యులతో కలిసి కారులో జూబ్లీహిల్స్‌లోని ఓ హోటల్‌లో శుభ కార్యానికి హాజ‌ర‌య్యారు. అనంత‌రం ఆయ‌న అర్ధ‌రాత్రి 12 గంట‌ల స‌మ‌యంలో జూబ్లీహిల్స్ రోడ్ నంబర్-33 మీదుగా కారులో ఇంటికి తిరిగి వెళ్తున్నారు.

అదే సమయంలో హీరో జూనియర్ ఎన్టీఆర్ ఇంట్లో పుట్టిన‌రోజు వేడుకల్లో పాల్గొన్న దర్శకుడు బాబీ తన వోల్వో కారులో అదే మార్గంలో వ‌చ్చారు. వేగంతో హ‌ర్మీందర్ కారును బలంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో కారు వెనుక భాగం పూర్తిగా ధ్వంస‌మైంది.

వెనుక సీట్‌లో కూర్చ‌ని ఉన్న హర్మీందర్‌సింగ్ తల్లి రీతూ కౌర్ గాయ‌ప‌డ్డారు. ఈ సంద‌ర్భంగా హర్మీందర్‌సింగ్ దర్శకుడు బాబీతో గొడ‌వ ప‌డ్డారు. కారు దిగ‌కుండానే తన ఇల్లు ద‌గ్గ‌రే ఉంద‌ని, అక్కడికి వెళ్లి మాట్లాడుకుందామని చెబుతూ వెళ్లిపోయాడు. దీనితో హర్మీందర్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here